twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెజాన్‌లో కీర్తీ సురేష్ పెంగ్విన్ డైరెక్ట్ రిలీజ్.. 3 నెలల్లో 7 మూవీస్.. OTTలో సినిమాల జోష్!

    |

    ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సినీ పరిశ్రమ అడుగులు వేస్తున్నది. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో నిర్మాతలు దిక్కు తోచని పరిస్థితుల్లో మునిగిపోయారు. సినిమాల రిలీజ్ ఆగిపోవడంతో వ్యయం పెరిగిపోవడం నిర్మాతలను ఒత్తిడికి గురిచేస్తున్నది. సినిమా హాళ్లలో చిత్రాలు రిలీజ్ కానీ పరిస్థితుల్లో దర్శక, నిర్మాతలు తమ సినిమాలను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొంటున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించేశారు. అందులో కొన్ని సినిమాలు వివరాలు మీ కోసం..

    దక్షిణాది నటి, సూర్య సతీమణి జ్యోతిక నటించిన పొన్‌మగల్ వంధాల్‌ను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయాలని నిర్ణయించడం వివాదంగా మారింది. పెద్ద ఎత్తున్న నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తమ ఆలోచనను సూర్యతోపాట దర్శక, నిర్మాతలు మానుకొన్నారు. కానీ తాజాగా తమ నిర్ణయాన్ని మరోసారి మార్చుకొని ఆ సినిమాను రిలీజ్ చేయడానికే ముందుకు వచ్చారు. దాంతోపాటు మరో ఏడు సినిమాలు వచ్చే మూడు నెలల్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కావడానికి సిద్ధమయ్యాయి.

    మే 29న పొన్‌మగల్ వంధల్

    మే 29న పొన్‌మగల్ వంధల్

    జేజే ఫ్రెడ్రిక్ దర్శకత్వంలో హీరో సూర్య నిర్మించిన పొన్ మగల్ వంధల్ (తమిళం) చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో మే 29న రిలీజ్ కానున్నది. లీగల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
    నటీనటులు: జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్
    రచన, దర్శకత్వం: జె.జె. ఫ్రెడరిక్

    జూన్ 12వ తేదీన గులాబో సితాబో

    జూన్ 12వ తేదీన గులాబో సితాబో

    అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ చిత్రం గులాబో సితాబో జూన్ 12వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
    రచన - జూహి చతుర్వేది
    దర్శకత్వం - షూజిత్ సిర్కార్
    నిర్మాత‌లు - రోన్ని లాహిరి, శీల్ కుమార్

    జూన్ 19వ తేదీన కీర్తీ సురేష్ పెంగ్విన్

    జూన్ 19వ తేదీన కీర్తీ సురేష్ పెంగ్విన్

    మహానటి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న కీర్తీ సురేష్ నటించిన తాజా చిత్రం పెంగ్విన్. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఈశ్వర్ కార్తీక్ రచించి దర్శకత్వం వహించిన చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలింస్, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నది. థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ గర్భిణిగా కనిపించబోతున్నది.

    జూన్ 26వ తేదీన

    జూన్ 26వ తేదీన

    కన్నడ చిత్రం లా జూన్ 26వ తేదీన అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు నటించారు. రాగిణి ఈ చిత్రంలో న్యాయశాస్త్రం చదివే విద్యార్థిగా నటించింది.
    రచన, దర్శకత్వం: రఘు సమర్థ్
    నిర్మాతలు: అశ్విని, పునీత్ రాజ్ కుమార్

    జూలై 24న రిలీజ్

    జూలై 24న రిలీజ్

    మరో కన్నడ చిత్రం ఫ్రెంచ్ బిర్యానీ కూడా ఓటీటీలో రిలీజ్ కావడానికి ముస్తాబైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ద్వారా జూలై 24, 2020న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్ తదితరులు నటించారు.
    రచన: అవినాశ్ బాలెక్కాల
    దర్శకత్వం: పన్నాగ భరణ
    నిర్మాతలు: అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ ఎ తల్వార్

    త్వరలోనే విద్యాబాలన్ చిత్రం

    త్వరలోనే విద్యాబాలన్ చిత్రం

    ప్రముఖ నటి విద్యాబాలన్ నటించిన హిందీ చిత్రం శకుంతలా దేవి కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌లకు ముస్తాబవుతున్నది. అయితే రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రదర్శించకపోవడం గమనార్హం. గణితశాస్త్ర పండితులు శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
    ర‌చన: నాయనిక మహ్తాని, అనూ మీనన్
    దర్శకత్వం: అనూ మీనన్
    నిర్మాత‌లు: అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా

    Recommended Video

    Producer C Kalyan About Tollywood Problems During Lockdown
    అదితిరావు హైదరీ నటించిన సుఫియాం సుజాతాయం

    అదితిరావు హైదరీ నటించిన సుఫియాం సుజాతాయం

    అందాల భామ అదితి రావు హైదరీ, టాలెంటెడ్ యాక్టర్ జయ సూర్య‌ నటించిన మలయాళ చిత్రం సుఫియాం సుజాతాయం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌లకు సిద్దమవుతున్నది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
    రచన, దర్శకత్వం: నరని పుజా షానవాస్
    నిర్మాణం: విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్

    English summary
    Coronavirus Lockdown making way to release movies on OTT platforms skipping Theatre release. This is the first time releasing movies without coming to theatre. There are 7 movies are going to release in three months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X