80s Reunion: స్టార్స్‌ రీయూనియన్‌.. ఒకే ఫ్రేమ్ లో సినీ తారలు..

80s stars reunion 2025: సౌత్ ఇండస్ట్రీకి చెందిన 80వ దశకపు తారలు ప్రతి ఏటా ఒకేచోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఇప్పుడు ఓ సాంప్రదాయంగా మారింది. "ది 80s స్టార్స్ రీయూనియన్" పేరుతో ఈ ప్రత్యేక వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఎంతో విశేషంగా సాగింది. ఈసారి రీయూనియన్ వేదికగా చెన్నై నిలిచింది. మూడేండ్ల విరామం తర్వాత ఈ రీయూనియన్ జరగడం విశేషం.

ఈ వేడుకకు హాజరవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. విమానంలో ఇద్దరూ కలసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రీయూనియన్‌లో 31 మందికి పైగా 80 స్టార్‌లు పాల్గొని మళ్లీ తమ పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఈసారి రీయూనియన్‌కు కోలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ సేతుపతి, ఆయన భార్య నటి-దర్శకురాలు శ్రీప్రియ ఆతిథ్యమిచ్చారు.

80s South Indian Stars Reunite in Chennai After Three Years A Nostalgic Celebration

మొత్తం 31 మంది సినీ తారలు ఈ వేడుకలో భాగమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమల నుంచి ప్రముఖులు ఒకేచోట కలసి, తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, మీనా, జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, జయరామ్, అశ్వితి జయరామ్, సరిత, భాను చందర్, మేనక, లత, స్వప్న, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు పాల్గొన్నారు.

ఈసారి రీయూనియన్ థీమ్‌గా "చిరుత థీమ్"ను ఎంచుకున్నారు. అందరూ చీతా ప్రింట్ ఉన్న డ్రెస్సుల్లో మెరిసి, ఫోటోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టించారు. ఈ వేడుకలో అందరూ సంతోషంగా ముచ్చటిస్తూ, ఆటపాటలతో ఎంజాయ్‌ చేస్తూ, ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కొందరు తమ కెరీర్‌ మొదటి రోజుల్లో జరిగిన సంఘటనలను పంచుకోగా, కొందరు పాత మిత్రులను చూసి ఆనందంతో మురిసిపోయారు.

ఈ రీయూనియన్ మొదట 2009లో లిస్సీ, సుహాసిని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతోంది. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్‌కు ఆతిథ్యమిచ్చారు. ఇక 2022లో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లన్ ఈ వేడుకను నిర్వహించారు. ఇక 2023లో రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నై వరదల కారణంగా వాయిదా పడిన ఈ వేడుక, ఈసారి చెన్నైలో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. "80ల్లో కలిసి పని చేసిన నా సహ నటీనటులను మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇది మాకు ఉన్న ఆప్యాయ బంధాన్ని, మమకారాన్ని చూపిస్తోంది," అని పేర్కొన్నారు. సినీ తారలంతా తమ కెరీర్ ప్రారంభ దశలో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ, ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ వేదిక మొత్తం ఉత్సాహంగా మారింది. "మళ్లీ ఒకసారి 80's మ్యాజిక్!" అనేలా ఈ రీయూనియన్ అభిమానులకు పండగలా మారింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X