‘ఆచార్య’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ: ఈ రెండింటిలో ఒకటి ఫిక్స్ చేయనున్న చిరంజీవి

'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆయనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. అయితే, దీని తర్వాత చేసిన 'సైరా: నరసింహారెడ్డి' మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు చిరంజీవి. ఇందులో భాగంగానే 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం 'ఆచార్య'. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో యూనిట్ క్లారిటీకి వచ్చేసిందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య'ను 2021 మే 14న కానీ, 21వ తేదీన కానీ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు డేట్లలో ఒక దానిని ఎంపిక చేసే బాధ్యతను చిరంజీవికే వదిలేసిందట చిత్ర యూనిట్. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉందని టాక్.

Acharya Release Date: Chiranjeevi Selected Two Dates

ఇదిలా ఉండగా, దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాడే వ్యక్తి కథతో తెరకెక్కుతోంది 'ఆచార్య'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆఫీసర్‌గానూ, నక్సలైట్ గానూ కనిపించనున్నారు. అలాగే, ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. అతడి క్యారెక్టర్ దాదాపు ముప్పై నిమిషాల వరకూ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చరణ్ సరసన కూడా ఓ హీరోయిన్‌ ఉంటుందని అంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అరవింద స్వామి ఇందులో విలన్‌గా చేస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X