అకస్మాత్తుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన అడివి శేష్.. సడన్ షాక్.. ఏం జరిగిందంటే?

విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యువ హీరో అడివి శేష్ అనారోగ్యానికి గురయ్యాడు. నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటూ కనిపిస్తూ ఉండే ఈ హీరో ఇటీవల హఠాత్తుగా ఆసుపత్రిలో చేరడం ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట ఈ విషయం గురించి తెలియక ముందే సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అడివి శేష్ అనారోగ్యంతో ఉన్నాడని కథనాలు రావడంతో కొంత మంది సెలబ్రిటీలు అతన్ని సంప్రదించి ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం అడవి శేష్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్తిగా కోలుకునే వరకూ కూడా అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం లేదని అంటున్నారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే.

మంచి టాలెంటెడ్ హీరోగా

మంచి టాలెంటెడ్ హీరోగా

అడవి శేష్ తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన సినిమాలతో ఎంత దగ్గరయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం హీరోగానే కాకుండా ఎన్నో సపోర్టింగ్ రోల్స్ విలన్స్ రోల్స్ తో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే అందుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో మొదట హీరో అవ్వాలని అడుగుపెట్టిన అడవి శేష్ ఆతర్వాత రచయితగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన విశేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగి అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతున్నాడు.

అనారోగ్యంతో అడివి శేష్

అనారోగ్యంతో అడివి శేష్

ప్రస్తుతం అడివి శేష్ హీరోగా కొన్ని ప్రయోగాత్మక సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల మేజర్ సినిమాకు సంబంధించిన కీలకమైన షూటింగ్ పనులను పూర్తి చేసుకుని అడివి శేష్ హఠాత్తుగా ఒక్కసారిగా నీరసంగా మారిపోయాడట. ఆ విషయాన్ని మొదట పెద్దగా సీరియస్ గా తీసుకోని ఈ నటుడు ఆ తర్వాత ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది.

డెంగ్యూ వ్యాధి రావడంతో

డెంగ్యూ వ్యాధి రావడంతో

ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే అడివి శేష్ డెంగ్యూ వ్యాధి బారిన పడ్డట్లు సమాచారం. గత కొంతకాలంగా నీరసంగా ఉండడంతో కుటుంబ సభ్యుల సలహామేరకు వైద్యులను సంప్రదించిన అడవి శేష్ కొన్ని హెల్త్ చెకప్ కూడా చేసుకున్నాడట. ఇక ఇటీవల బ్లేడ్ ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా పడిపోవడంతో, రిపోర్ట్ లో అతనికి డెంగ్యూ వ్యాధి ఉందని నిర్దారణ అయ్యిందట.

ఆసుపత్రిలోనే అడివి శేష్

ఆసుపత్రిలోనే అడివి శేష్

తప్పకుండా ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అడివి శేష్ ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని సమాచారం అందుతోంది. ఈ విషయంలో వైద్యుల నుంచి అధికారికంగా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అడివి శేష్ గత వారం డెంగ్యూ బారిన పడ్డట్లు తెలుస్తోంది. ఇక అతను సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరాడు.

Recommended Video

Adivi Sesh To Play AP Police Officer In HIT 2 | Nani | Vishwak Sen
ఆ సినిమాలతో బిజీగా..

ఆ సినిమాలతో బిజీగా..

ఇక ప్రస్తుతం హీరో మేజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అడవి శేష్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. మహేష్ బాబు ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలుగులో మంచి విజయం అందుకున్నటువంటి హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న హిట్ 2 సినిమాను కూడా ఇటీవల స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలతో బిజీగా ఉండగానే అడవి శేష్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X