For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో వివాదంలో నటుడు నరేష్.. ఆ హీరోను లాగుతూ తాలిబాన్లలా మారిపోయారని కామెంట్స్!

  |

  ఈ మధ్య మా ఎన్నికల వ్యవహారం టాలీవుడ్ ని షేక్ చేస్తోంది, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లు హోరా హోరిన మా ఎన్నికల్లో తలపడబోతున్నారు. మధ్యలో నరసింహారావు, కాదంబరి కిరణ్ లు సైతం మా ఎన్నికల మేటర్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. తాజాగా మా అధ్యక్షుడు నరేష్ ఇవ్వబోయే ఓ స్పెషల్ వీకెండ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో హైలెట్ గా మారింది. అది మరువక ముందే ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలనం రేపారు. అసలు ఏమైంది అనే వివరాల్లోకి వెళితే

  ఎవరూ లేని సమయంలో

  ఎవరూ లేని సమయంలో

  తాజాగా మీడియా ముందుకు వచ్చిన సినీ నటుడు, మా అధ్యక్షుడు డాక్టర్ నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇది సినిమా రంగానికి సంబంధించిన విషయం కాదు. గచ్చిబౌలి నానక్ రామ్ గూడ లో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ రెసిడెన్సీ గురించి ఆయన మాట్లాడారు. అవి మా ల్యాండ్ లో మేము కట్టిన ఇళ్లని, ఇందులో మొత్తం 487 ఫ్లాట్స్ ఉన్నాయి, 1500 మంది ఉంటారని నరేష్ పేర్కొన్నారు.

  ఎవరూ లేని సమయంలో

  ఎవరూ లేని సమయంలో

  ఒక్కసారి ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత బిల్డింగ్ ను అక్రమంగా ప్లాన్ కు విరుద్ధంగా కడుతున్నారని, ఇలా మొత్తం మూడు ఫ్లాట్ లను ప్లాన్ కు విరుద్ధంగా కడుతున్నారని, అలా చేయడం వలన బిల్డింగ్ కూలే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో మిగతా ఫ్లాట్ యజమానులు అందరూ భయపడుతున్నారని, ఇది వరకు ఉన్న అసోసియేషన్ ను కబ్జాలోకి తీసుకొని, కరోన లాక్ డౌన్ లో ఎవరూ లేని సమయంలో ఎలక్షన్స్ పెట్టారని ఆయన అన్నారు.

  ఓ సెలబ్రెటీనీ అయినా

  ఓ సెలబ్రెటీనీ అయినా

  మాధవ్ కోనేరు, ప్రీతి శుక్ల , సంజయ్ రెడ్డి అనే ముగ్గురు కలిసి ఫ్లాట్ యజమానుల పై దాడులకు దాడులకు సైతం దిగుతున్నారని నరేష్ ఆరోపించి, సొసైటీ ఫండ్ ను సైతం పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. నేను ఓ సెలబ్రెటీనీ అయినా నన్ను కూడా మెయిల్స్ పంపిస్తూ బెదిరిస్తున్నారని అన్నారు. ఇక నేను ఎప్పుడు కాంట్రావర్సీకి కి పోను....కానీ నా వద్దకు వస్తే ఊరుకునని ఆయన అన్నారు.

   సిటీ నడిబొడ్డున ఈ ఇష్యూ

  సిటీ నడిబొడ్డున ఈ ఇష్యూ

  ఇక ఈ అంశంలో ఈరోజు GHMC సిటీ చీఫ్ ప్లానర్ ను కలవడం జరిగిందన్న ఆయన గ్రేటర్ అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. వారు మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్న నరేష్ సిటీ నడిబొడ్డున ఈ ఇష్యూ జరగడం బాధాకరమని, మేము ఈ ఇష్యూ ను సీరియస్ గా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక B2714 లో యాక్టర్ కన్నడ హీరో సుదీప్ ఉంటారు, ఆ ఫ్లాట్ ను కూడా ప్లాన్ కు విరుద్ధంగా కడుతున్నారని ఆయన ఆరోపించారు.

  సుదీప్ కు రెండు ఫ్లాట్ లు

  సుదీప్ కు రెండు ఫ్లాట్ లు

  గోల్ఫ్ ఎడ్జ్ రెసిడెన్సీలో సుదీప్ కు రెండు ఫ్లాట్ లు ఉన్నాయి, సుదీప్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్న మనం అందరం సినిమా కుటుంబ సభ్యులం, ఫ్లాట్ లో జరుగుతున్న అక్రమ కట్టడాలు వెంటనే ఆపివేయాలి అని అన్నారు. ఈ అక్రమ కట్టడాల వెనుక కన్నడ నటుడు హీరో సుదీప్ కూడా ఉండటం బాధాకరమని పేర్కొన్న ఆయన దీనివలన ఫ్లాట్ యజమానులు భయపడుతున్నారని అన్నారు.

  Harbhajan Singh Exclusive | Bajji About South Indian Actors
  ఒక మాఫియా గా ఏర్పడి

  ఒక మాఫియా గా ఏర్పడి

  కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక మాఫియా గా ఏర్పడి ఫ్లాట్ లలో అక్రమ కట్టడాలు చేస్తున్నారని, ఎందుకు అని అడిగిన మధు లాల్ అనే మహిళను విపరీతంగా హింస పెట్టారని, తాలిబన్ లా ఒక బ్లాక్ ను తమ ఆధీనంలోకి తీసుకుని ప్లాట్ ఓనర్లను హింసిస్తున్నారని ఆయన అన్నారు. విషయాన్నీ డీవియేట్ చేస్తూ నోటీసులు ఇచ్చిన లెక్క చెయ్యకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఎవరు వచ్చిన వారి పై దాడులు చేస్తున్నారన్న నరేష్ మాధవ్ కోనేరు జనరల్ సెక్రటరీ గా వ్యవహరిస్తూ సొసైటీ ఆఫీస్ ను తన సొంత ఆఫీస్ ల వాడుకుంటున్నారని అన్నారు.

  English summary
  Actor Naresh made sensational allegations on sudeep on golf edge residency issue, he alleged that few persons are trying to build illegally.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X