రాజశేఖర్ పెద్ద కూతురు ఫస్ట్ మూవీ.. హీరో ఎవరో తెలుసా.. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వారి కాంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కపుల్స్ రాజశేఖర్, జీవిత. హీరోగా కొత్తగా ట్రై చేస్తున్న రాజశేఖర్ మరో వైపు కుతుళ్ళను కూడా సిద్ధం చేస్తున్నాడు. తన సినిమాల కథలపై చర్చలు జరుపుతూనే కూతుళ్ళ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ లపై కూడా చర్చలు జరుపుతున్నారట. పెద్ద కూతురు శివాని కోసం రీసెంట్ గా రాజశేఖర్ ఒక కథ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

శివాని ఎంట్రీ..
రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు మొత్తానికి హీరోయిన్ ఒక అవకాశం దక్కించుకుంది. త్వరలో ఆమె మొదటి సినిమా స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చిన్న కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి శివాత్మిక తన నటనతో జనాలను బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఇక నెక్స్ట్ శివాని రాజశేఖర్ కూడా సరికొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మొదటి ఛాన్స్ మిస్..
అసలైతే శివాని గత ఏడాదే ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అడివి శేష్ చేయాల్సిన బాలీవుడ్ రీమేక్ మూవీ 2 స్టేట్స్ లో ఈ బ్యూటీని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆ సినిమా అనుకోని విధంగా సెట్స్ పైకి రాకముందే క్యాన్సిల్ అయ్యింది. ఆ తరువాత శివాని రాజశేఖర్ కి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఎందుకో ఒప్పుకోలేదు. ఇక ఫైనల్ గా ఒక కథ నచ్చడంతో షూటింగ్ తో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

హీరో అతనే..
కొత్త టెక్నీషియన్స్ తో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కథలో శివాని హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సమాచారం. ఇక ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా ఆ కథలో హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

శివాత్మిక కూడా..
దొరసాని సినిమా డిజాస్టర్ కావడంతో శివాత్మిక కాస్త ఆలోచనలో పడింది విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉహించని పరాజయాన్ని అందుకుంది. ఇక నెక్స్ట్ స్టోరీ సెలక్షన్స్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ బ్యూటీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











