Don't Miss!
- News
ఫిబ్రవరి 7.. `రాజధాని అమరావతి`కి బిగ్ డే..!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sarathkumar: హఠాత్తుగా అస్వస్థతకు గురైన శరత్ కుమార్.. ఆస్పత్రికి తరలింపు.. ఏం జరిగిందంటే?
తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకున్న నటుడు శరత్ కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇక పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. గతంలోనే కొన్నిసార్లు పలు అనారోగ్య కారణాల వలన కొన్ని రోజుల పాటు హాస్పిటల్ లో ఉండి శరత్ కుమార్ చికిత్స తీసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్యం క్షిణించడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది.
శరత్ కుమార్ భార్య రాధిక శరత్ కుమార్ తో పాటు ఆయన కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నారు. వారితోపాటు కొంతమంది కుటుంబ సన్నిహితులు సినీ ప్రముఖులు కూడా హాస్పిటల్కు చేరుకొని శరత్ కుమార్ ఆరోగ్య విషయం గురించి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన పరిస్థితి క్లిష్టంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో వివిధ రకాల రూమర్స్ రావడంతో అందులో ఎలాంటి నిజం లేదు అని వారి సన్నిహితులు తెలియజేశారు.

డయేరియాతో డీహైడ్రేషన్‌కు గురైన శరత్ కుమార్ కు ప్రస్తుతం అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని త్వరలోనే వివరాలు తెలుస్తాయని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు రాధిక శరత్ కుమార్ అలాగే ఆయన కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఇలాంటి వివరణ అయితే ఇవ్వలేదు.
హాస్పిటల్ నుంచి కూడా మెడికల్ బుల్లెట్ విడుదల కావాల్సి ఉంది. శరత్ కుమార్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా కొన్ని మంచి సినిమాలు చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో నటించిన శరత్ కు మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఆ తర్వాత జనరేషన్ తో కూడా ఆయన కొన్ని సినిమాలు చేశాడు. అల్లు అర్జున్ తో బన్నీ సినిమాలో తండ్రిగా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం కూడా ఆయన తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.