Don't Miss!
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- News
student: న్యూడ్ వీడియోతో షాక్ అయిన కాలేజ్ విద్యార్థి, బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్టు లేడీ, క్లైమాక్స్ లో?
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై హీరో విశాల్ క్లారిటీ.. జగన్, పవన్ పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్!
తమిళ హీరోగా మంచి గుర్తింపు అందుకున్న హీరో విశాల్ ఇటీవల కాలంలో మాత్రం తెలుగులో సరైన సక్సెస్ చూడలేదు. ఒకప్పుడు తెలుగులో కూడా అతనికి మంచి విజయాలు వచ్చాయి. ఈసారి ఎలాగైనా లాఠీ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు.
ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న విశాల్ ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ ప్రముఖుల గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా కుప్పంలో పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలలోకి వెళితే..

టాలీవుడ్ ను విడిచిపెట్టలేదు
తమిళ నటుడు విశాల్ తెలుగులో కూడా మంచి హీరోగా గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. విశాల్ తండ్రి జీకే రెడ్డి తెలుగులో కూడా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వారిది తెలుగు ఫ్యామిలీ. కాకపోతే ఎప్పటినుంచో చెన్నైలో స్థిరపడిపోవడం వలన తమిళంలోని రెగ్యులర్ హీరోగా అతను కొనసాగుతూ వస్తున్నాడు. అయినప్పటికీ కూడా టాలీవుడ్ ను ఏ మాత్రం విడిచిపెట్టలేదు.

లాఠీ రిలీజ్ ప్రమోషన్స్
విశాల్ తన ప్రతి సినిమాను కూడా తమిళంలో ఎలాగైతే ప్రమోషన్ చేసి విడుదల చేస్తాడో తెలుగులో కూడా అదే తరహాలో రిలీజ్ చేస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు లాఠీ సినిమాను కూడా అదే తరహాలో ప్రమోట్ చేసి డిసెంబర్ 22న విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో అతను ఏపీ పాలిటిక్స్ పై కూడా రియాక్ట్ కావడం హైలైట్ గా నిలిచింది.

జగన్ కు ఓటు వేస్తాను..
గతంలోనే విశాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించాడు. ముఖ్యంగా జగన్ గెలుస్తాడు అని కూడా అతను ముందుగానే వివరణ ఇచ్చాడు. ఎందుకంటే వైఎస్ జగన్ పాదయాత్ర వలన జనాల్లో మంచి గుర్తింపు అందుకున్నాడు అని.. ఇప్పుడు కూడా అతనికి మంచి గుర్తింపు ఉంది అని అన్నాడు. అలాగే ఓటు వేయాల్సి వస్తే జగన్ కు వేస్తాను అని కూడా విశాల్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

కుప్పం నుంచి పోటీ
అయితే వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి విశాల్ పోటీ చేయబోతున్నాడు అని కొన్ని వార్తలు రాగా అందులో ఎలాంటి నిజం లేదు అని అన్నాడు. ఒక విధంగా కుప్పం నాకు ఇష్టమైన ప్రాంతం అంటూ.. ఎందుకంటే నాన్నగారు వ్యాపారాలు చేసినప్పుడు అక్కడ నేను రెండు మూడేళ్లు ఉన్నాను. కాబట్టి అక్కడ ఉన్న చాలా వీధులు కూడా నాకు తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను పోటీ చేస్తున్నాను అనేది మాత్రం నిజం కాదు.. అని విశాల్ అన్నాడు.

పవన్ ను అభిమానిస్తాను..
ఇక రాజకీయాలు, సినిమాలో ఒకటి కాదు అని వైఎస్ జగన్ ను మాత్రం నేను ఒక పొలిటిషియన్ గా ఇష్టపడతాను.. ఓటు వేయాల్సి వస్తే ఆయనకే వేస్తాను అని చెప్పిన విశాల్.. పవన్ కళ్యాణ్ ను మాత్రం ఒక సినిమా హీరోగా అభిమానిస్తాను అని అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తనకు సినిమాల్లోకి రాకముందు నుంచే తెలుసు అని నాన్నగారు చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు ఆయనను మొదటిసారి చూసాను అని విశాల్ తెలియజేశాడు. ఇక ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.