twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ నటి భానుప్రియ అరెస్ట్‌కు రంగం సిద్ధం?.. చెన్నై పోలీసుల షాక్

    |

    బాల కార్మికుల చట్టం కింద నమోదైన కేసు సినీ నటి భానుప్రియ‌ను వెంటాడుతున్నది. 2019 జనవరిలో నమోదైన కేసు ఇప్పుడు ఆమె పీకల మీదకు తెచ్చినట్టు స్పష్టమైంది. ఈ కేసులో భానుప్రియ అరెస్ట్ అనివార్యంగా మారిందనే కథనాలు మీడియాలో జోరందుకొన్నాయి. అయితే ఈ కేసులో అసలేం జరిగిందంటే..

    మైనర్ బాలికను వేధించారని

    మైనర్ బాలికను వేధించారని

    చెన్నైలో తన నివాసంలో మైనర్ బాలికను ఇంటి పనులకు ఉపయోగించుకొంటూ వేధించారనే ఆరోపణలతో సమైక్యాంధ్రలో కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు విరుద్దంగా తమ పని మనిషి ఇంట్లో దొంగతనానికి పాల్పడిందని భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత వివాదంగా మారింది.

    సామర్లకోటలో కేసు

    సామర్లకోటలో కేసు

    ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఫిర్యాదులతో కేసు అత్యంత వివాదంగా మారింది. దాంతో పని మనిషి తల్లి సామర్లకోటలోకేసు నమోదు చేసింది. తన కూతురిని వేధించినందుకు భానుప్రియ, గోపాలకృష్ణన్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే భానుప్రియ ఫిర్యాదు మేరకు పనిమనిషిని, ఆమె తల్లిని చెన్నైలో అరెస్ట్ చేసి విచారించారు.

    పనిమనిషి కుటుంబం ఆరోపణలు

    పనిమనిషి కుటుంబం ఆరోపణలు

    ఇంట్లో నిర్బంధించి చిత్రవధకు గురిచేస్తున్నారు. నా కూతురును రక్షించాలి అని పనిమనిషి తల్లి ప్రభావతి పోలీసులను కోరింది. ఘటన చెన్నైలో జరిగినందున కేసుతో సామర్లకోట పోలీసులు సంబంధం లేదని తేల్చారు. ఈ కేసును చెన్నై పోలీసులకు ఇటీవల తరలించారు. నటి భానుప్రియపై నమోదైన బాల కార్మికుల చట్టం కింద కేసు విచారణను వేగవంతం చేశారు.

    చెన్నై పోలీసులకు కేసు

    చెన్నై పోలీసులకు కేసు

    భానుప్రియపై నమోదైన కేసు విచారణ ఇప్పుడు సామర్లకోట పోలీసుల నుంచి చెన్నై పోలీసులు చేతికి వెళ్లింది. దాంతో ఈ కేసు విచారణ ఊపందుకోవడంతో భానుప్రియ కష్టాల్లో పడింది. దాంతో ఈ కేసును చెన్నైలోని పాండిబజార్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా భానుప్రియను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా సాగుతున్నది.

    English summary
    Film actress Bhanupriya has fixed in domestic help harrassment case. Chennai police registered a case against her and brother Gopalakrishna. Case and FIR was registered following a post from the Superintendent of Police, East Godavari, Kakinada, Andhra Pradesh, transferring it from the Samalkot police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X