For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya: ప్రామిస్ చేసినట్టే చూపించాడు.. రవితేజకు అలా పిలిస్తే నచ్చదు.. కేథరిన్ కామెంట్స్

  |

  రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఉత్సాహంతోనే ఆయన ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్ ఫాదర్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా చాలా ప్రాజెక్టులను చేస్తున్నారు. అందులో 'వాల్తేరు వీరయ్య' ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.

  Kajal Aggarwal: గ్లామర్ కంచె తెంచేసిన కాజల్.. బ్లేజర్ తీసేసి మరీ హాట్ షో

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నారు. దీనికి సమయం ఆసన్నం కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఎంతో వైభవంగా జరుగుతోన్న ఈ వేడుకకు మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చారు. ఇక, ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోన్న కేథరిన్ థ్రెస్సా ఈ ఈవెంట్‌లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

  Actress Catherine Tresa Speech at Waltair Veerayya Event

  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కేథరిన్ 'అందరికీ నమస్కారం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. విశాఖపట్నంలో ఈ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా.. ఈ సంక్రాంతికి థియేటర్లు దడదడలాడబోతున్నాయి. చిరంజీవి గారూ.. మీతో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీరు నిజమైన మెగాస్టార్. అలాగే రవిగారు.. నాకు తెలుసు మిమ్మల్ని అలా పిలిస్తే నచ్చదు. మీ ఎనర్జీ, పాజిటివిటీ అన్నింటికీ మించి మీరు గొప్ప మానవతావాది. మీతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అలాగే, థ్యాంక్యూ బాబీ.. నాకు ఏమని ప్రామిస్ చేశావో.. సినిమాలో అలాగే చూపించావు. దీంతో మీ మీద గౌరవం పెరిగింది. అందుకే మీరు ఈ చిత్రాన్ని ఇంత మంచిగా పూర్తి చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే' అని చెప్పింది.

  49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన హీరోయిన్: అది డ్రెస్సా? చేపలు పట్టే వలా?

  చిరంజీవి - రవితేజ కలిసి నటించిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

  English summary
  Waltair Veerayya Movie Unit Conducts Pre Release Event At AU Grounds. Lets See Actress Catherine Tresa Speech at this Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X