For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈడీ విచారణకు ఛార్మీ.. కెల్విన్ తో వాట్సాప్ చాట్ లీక్.. కీలక వివరాలతోనే ఇలా?

  |

  టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. 2017 లో నమోదైన ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం అప్పట్లో ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు.. కాని కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో మళ్లీ ఈ వ్యవహారం మొదటికి వచ్చినట్లయింది. అయితే మొన్న పూరి జగన్నాథ్ కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు విచారణకు హాజరు కాగా ఈ రోజు ఆయన వ్యాపార భాగస్వామి, హీరోయిన్ ఛార్మి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు హాజరయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

  Avinash Engagement: అవినాష్ పెళ్లాడే అమ్మాయి ఎవరంటే.. పర్సనల్ ఫొటోల్లో ఎలా ఉందో చూడండి!

  ఆ సంస్థ వల్లే మళ్ళీ కొత్తగా

  ఆ సంస్థ వల్లే మళ్ళీ కొత్తగా

  2017 లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంతలా టెన్షన్ పెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ కి సంబంధించిన కొందరు డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగి వారందరినీ విచారించింది. అంతేకాక వారందరి వద్ద రక్త నమూనాలు, గోళ్ళు, జుట్టు వంటి వాటిని కూడా సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపింది.

  ఈ ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిన తర్వాత ఈ కేసు బాగా మందగించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఈ కేసులో ముందు కనిపించిన వేగం అయితే కనిపించలేదు. ఈ వ్యవహారంతో రంగంలోకి దిగిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ ఈ కేసును నీరు గారి ప్రయత్నం చేస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది.

  వాటి ఆధారంగానే నోటీసులు

  వాటి ఆధారంగానే నోటీసులు

  కొద్ది రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసు మీద దృష్టి పెట్టారు. దగ్గర దగ్గర ముగ్గురు నైజీరియా ముఠాకు చెందిన డ్రగ్ పెడ్లర్స్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం విచారణ చేయగా అందులో కెల్విన్ అనే ఒక వ్యక్తి ఇచ్చిన కీలక సమాచారం మేరకు దాదాపు 12 మంది సినీ ఈ రంగానికి చెందిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు.

  గతంలో విచారణ చేసిన వారినే కాకుండా ఈసారి కొత్తగా దగ్గుబాటి వారసుడు రానా, హీరోయిన్ రకుల్ ప్రీత్ లను కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ముందుగా ఈ లిస్టులో పూరి జగన్నాథ్ పేరు ఉండటంతో ఆయన విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. మొదటి రోజు విచారణకు హాజరైన ఆయన దాదాపు ఏడున్నర గంటల సేపు విచారణలో పాల్గొన్నారు.

  అప్రూవర్ గా మారడంతో కొత్త చిక్కులు

  అప్రూవర్ గా మారడంతో కొత్త చిక్కులు

  ఇక ఈ రోజు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు నటి ఛార్మి హాజరయ్యారు. అప్రువర్ గా మారిన డ్రగ్ పెడ్లర్ కెల్విన్ తో ఆర్థిక లావాదేవీలపై విచారణ జరగబోతోందని తెలుస్తోంది. బ్యాంక్ ఖాతాల వివారాలను వెంట తేవాలని ఛార్మీకి ఈడీ ఆదేశాలు జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది, ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కో ప్రొడ్యూసర్ గా అనేక సినిమాలు తీసిన ఛార్మీ ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లైగర్ అనే సినిమాకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.

  నిజానికి చార్మి 2017 లో డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విచారణ కూడా ఎదుర్కొంది. అయితే ఈ కేసులో తనను విచారించ కూడదు అంటూ హైకోర్టు వరకు వెళ్లగా హైకోర్టు మాత్రం విచారణ చేయొచ్చని కాకపోతే కొన్ని విషయాలలో పరిమితులు ఉంటాయి అని చెబుతూ ఛార్మికి ఊరటనిచ్చింది.

  కీలకంగా మారిన వాట్సాప్ చాట్!

  కీలకంగా మారిన వాట్సాప్ చాట్!

  తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఛార్మి కెల్విన్ మధ్య వాట్సాప్ చాట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అప్రూవర్గా మారిన నేపథ్యంలో కెల్విన్ ఫోన్లో ఉన్న వాట్సాప్ చాట్ మొత్తాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చదివారని వాట్సాప్ చాట్ ఆధారంగానే ఛార్మికి నోటీసులు ఇచ్చారని అంటున్నారు.

  అయితే పూరి జగన్నాథ్ చార్మికు కెల్విన్ ను పరిచయం చేశారా? లేక పూరి జగన్నాథ్ కు చార్మి కెల్విన్ ని పరిచయం చేశారా అనే విషయాల మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక స్వయంగా డ్రగ్స్ అమ్మినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అప్రూవర్ గా మారడంతో సినీ ప్రముఖులకు చిక్కులు తప్పవు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

  షూటింగ్ కోసమే డబ్బు?

  షూటింగ్ కోసమే డబ్బు?

  ఇక పూరి జగన్నాథ్ విచారణలో సైతం ఆయన రెండుసార్లు దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తుల బ్యాంకు అకౌంట్లకు డబ్బులు పంపినట్లుగా ఆరోపణలు వినిపించాయి అయితే తన సినిమా షూటింగ్ నిమిత్తం ఆయా వ్యక్తులకు డబ్బులు పంపించానని పూరి జగన్నాథ్ మొన్నటి విచారణలో చెప్పినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

  Oneindia DW Video Contest Sept 02
  చార్మిని ఎన్ని గంటలు విచారిస్తారో?

  చార్మిని ఎన్ని గంటలు విచారిస్తారో?

  అయితే పూరి జగన్నాథ్ చార్మి కలిసి సినిమాలు చేస్తూ ఉండడంతో ఇప్పుడు ఛార్మిని కూడా విచారణకు పిలవడంతో ఆమెను ఎన్ని గంటల పాటు విచారణ చేయనున్నారు అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. జరుగుతున్న ప్రచారం మేరకు కెల్విన్ అన్ని వివరాలు వెల్లడించాడని, కొన్నిసార్లు బిట్కాయిన్ లాంటి మార్గాల ద్వారా కూడా డబ్బులు విదేశాలకు పంపినట్లు ఆయన ఒప్పుకున్నాడు అని అంటున్నారు.

  మరి ఈ అంశంమీద సినీ ప్రముఖులు ఏమని స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. మొన్న పూరి జగన్నాథ్ విచారణ తరువాత మీడియాతో ఏమీ మాట్లాడకుండానే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఛార్మి కూడా అలానే వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది.

  English summary
  As we all know Tollywood drugs case has been came into limelight again, actress charmi Kaur has attended before Ed for interrogation in drugs case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X