సోనూసూద్ ప్రైమ్ మినిష్టర్ అవ్వాలి.. నా ఓటు ఆయనకే: స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

గత ఏడాది కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి కూడా సోనూసూద్ అలుపు లేకుండా తన సహాయలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం కూడా కష్టాల్లో అర్ధించిన వారికి లేదనకుండా ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆకలి బాధను అర్థం చేసుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా పెద వారిని ఆదుకున్నాడు. అలాగే రైతులకు కూడా అండగా నిలిచాడు. ఇక రీసెంట్ ఒక హీరోయిన్ సోనూసూద్ ప్రధాని అవ్వాలని కొరుకుంది.

Recommended Video

Sonu Sood To Set Up Oxygen Plants In Kurnool, Nellore Hospitals || Filmibeat Telugu
 కోట్ల రూపాయలతో

కోట్ల రూపాయలతో

సెకండ్ వేవ్ లో కూడా కరోనా మరింత ఉదృతం అయినప్పటికీ కూడా సోనూసూద్ ఏ మాత్రం తగ్గలేదు. ఏకంగా కోట్ల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. అయితే సోనూసూద్ సేవలపై సినిమా తారాలు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఎలాంటి అధికారం లేకపోతేనె సోనూసూద్ ఇంత చేశాడు అంటే.. ఏదైనా పదవి ఇప్పిస్తే మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ సహాయలు చేయగలడని అంటున్నారు.

సోనూసూద్ ప్రైమ్ మినిష్టర్ అవ్వాలి

సోనూసూద్ ప్రైమ్ మినిష్టర్ అవ్వాలి

బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోనూసూద్ కు ప్రైమ్ మినిష్టర్ అయ్యే అర్హత ఉందని అలాంటి బాధ్యత అతనికి అప్పగిస్తే ఇంకా ఎన్నో మంచి పనులు చేయగలడని కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్నికల్లో నిలబడితే

ఎన్నికల్లో నిలబడితే


అలాగే అతను ఎన్నికల్లో నిలబడితే తప్పకుండా తన ఓటు కూడా అతనికే వేస్తానని హుమా ఖురేషి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సోనూసూద్ ఎంతో బాధ్యతాయుతంగా సహాయలు అందిస్తున్నాడని అతని చేసేవిధానం నలుగురికి ఎంతగానో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని కూడా ఆమె తెలియజేశారు.

పాలిటిక్స్ పై సోనూసూద్ క్లారిటీ..

పాలిటిక్స్ పై సోనూసూద్ క్లారిటీ..

హుమా ఖురేషి మాత్రమే కాకుండా గతంలో చాలామంది సెలబ్రెటీలు, జనాలు కూడా సోనూసూద్ రాజకీయాల్లోకి రావాలని తెలిపారు. అయితే సోనూసూద్ మాత్రం ఇప్పట్లో తాను పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచనలో లేను అని క్లియర్ గా వివరణ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని, అప్పటివరకు కూడా తాను ఈ విధంగానే సహాయలు చేస్తానని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X