అలాంటి మాటలతో టార్గెట్.. యూట్యూబర్‌కి షాకిచ్చిన మంచు లక్ష్మీ, ఇక తాడోపేడో
మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మీ ప్రసన్న. టీవీ హోస్ట్‌గా, నటిగా, నిర్మాతగానూ ఆమె రాణించారు. ఎలాంటి విషయమైనా కుండబద్ధలు కొట్టి మాట్లాడటంలో లక్ష్మీ ప్రసన్న తన తండ్రికి ఏమాత్రం తీసిపోరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను ఉద్దేశించి అనుచితంగా ప్రశ్నలు అడిగిన యూట్యూబర్‌కు షాకిచ్చారు లక్ష్మీ. ఈ వివరాల్లోకి వెళితే..
నటిగా మంచు లక్ష్మీ
తొలుత ఇంగ్లీష్ సినిమాలలో నటించిన మంచు లక్ష్మీ.. ఆ తర్వాత ఝుమ్మంది నాదం సినిమాలో గెస్ట్ రోల్ పోషించారు. అనంతరం అనగనగా ఓ ధీరుడు, దొంగల ముఠా, డిపార్ట్‌మెంట్, ఊ కొడతారా? ఉలిక్కిపడతారా?, కాదల్, గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, చందమామ కథలు, సైజ్ జీరో, లక్ష్మీబాంబ్, పిట్టకథలు తదితర చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ నటిగా నిలదొక్కుకున్నారు మంచు లక్ష్మీ. ఇక నిర్మాతగా శ్రీ, నేను మీకు తెలుసా?, ఝుమ్మంది నాదం, ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? గుండెల్లో గోదారి, దొంగాట సినిమాలను నిర్మించారు.

ముంబైకి మకాం మార్చేసిన లక్ష్మీ
బుల్లితెరపై లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మీ, లక్ ఉంటే లక్ష్మీ, మేము సైతం, మహారాణి, సూపర్ జోడీ వంటి షోలకు న్యాయ నిర్ణేతగా, హోస్ట్‌గా రాణించారు. ప్రస్తుతం ఓటీటీలు, వెబ్ సిరీస్‌ల యుగం కావడంతో ఈ దిశగానూ లక్ష్మీ అవకాశాలను అందుకుంటున్నారు. గత కొంతకాలంగా అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలతో మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మంచు లక్ష్మీ ఆకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తన కెరీర్‌తో పాటు కూతురి చదువు కోసమే తాను ముంబైకి మారినట్లు లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు.
ట్రోలింగ్‌పై యాక్షన్
తొలి నుంచి ట్రోలింగ్, నెగిటివ్ ప్రచారంపై మంచు లక్ష్మీ సీరియస్‌గా ఉండేవారు. సోషల్ మీడియాలో కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ తనతో అనుచితంగా ప్రవర్తించే వారి తాట తీస్తారు. ప్రస్తుతం మంచు లక్ష్మీ దక్ష అనే సినిమాలో నటించగా.. సెప్టెంబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మీ పలు ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత వివరాలు, మంచు ఫ్యామిలీలో గొడవలు, కెరీర్ గురించి ఆమె కీలక విషయాలు ప్రస్తావించారు. అయితే ఓ యూట్యూబర్ చేసిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీని బాడీ షేమింగ్, వయసు, లింగ వివక్షకు సంబంధించిన ప్రశ్నలు అడగటంతో ఆమె సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు.
యూట్యూబర్‌పై ఫిర్యాదు
ఆ మాటలతో అప్పుడే ఘాటుగా రిప్లయ్ ఇచ్చిన మంచు లక్ష్మీ తాజాగా యాక్షన్‌లోకి దిగారు. సదరు యూట్యూబర్‌పై తెలుగు ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై ఆ యూట్యూబర్ బాడీ షేమింగ్, వయసు, లింగ వివక్షకు గురిచేసేలా వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని మంచు లక్ష్మీ.. ఇక్కడితో వదిలి పెట్టకూడదని భావిస్తున్నారట. దీనిలో భాగంగా తెలంగాణ మహిళా కమీషన్ దగ్గరికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం మంచు లక్ష్మీ ఫిర్యాదు వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











