For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్లీ మొదలు పెట్టిన ‘మేజర్’: మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చేసిన హీరో అడవి శేష్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును దక్కించుకున్నాడు. అలాంటి వారిలో యంగ్ స్టార్ అడవి శేష్ ఒకడు. విలన్ పాత్రలు చేస్తూ కెరీర్‌ను ఆరంభించిన ఈ టాలెంటెడ్ కుర్రాడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో అడవి శేష్ వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.

  వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అడవి శేష్ ప్రస్తుతం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' అనే సినిమా చేస్తున్నాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి వచ్చేసింది.

  'మేజర్' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. అయితే, మధ్యలో రెండు సార్లు కరోనా రూపంలో ఆటంకాలు ఏర్పడడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ పూర్తి కాలేదు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ ఈరోజు పున: ప్రారంభం అయింది. హైదరాబాద్‌లోని ఓ ఫిల్మ్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే, హీరో ఆర్మీ ట్రైనింగ్‌ను సంబంధించిన సీన్లను కూడా షూట్ చేయబోతున్నారు. ఇక, ఈ షెడ్యూల్‌లోనే టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ప్లాన్ చేసుకుంది.

  Adivi Sesh Major Movie Shooting Resume

  తాజాగా 'మేజర్' మూవీకి షూటింగ్ పున: ప్రారంభం అయిన విషయాన్ని వెల్లడించిన అడవి శేష్.. రిలీజ్ గురించి కూడా స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'మేజర్ మూవీ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం అయింది. దీన్ని మీ ముందుకు తీసుకు వచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అనకూల పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని థియేటర్లలో విడుదల చేస్తాము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రజలారా.. మన స్వాతంత్య్ర దినోత్సవం ఇక్కడే ఉంది. ఇది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో వస్తుంది.. జైహింద్' అంటూ రాసుకొచ్చాడు.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మేజర్' మూవీ కోసం అడవి శేష్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. లుక్ టెస్ట్ కోసం అతడు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాకు కథా సహకారం కూడా అందించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

  English summary
  Adivi Sesh Now Doing A Film is Major. Directed by Sashi Kiran Tikka Under Mahesh Babu Production. Today This Movie Shooting Resumed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X