Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Automobiles
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్ - సురేందర్ రెడ్డి మూవీపై లేటెస్ట్ అప్‌డేట్: అప్పటి నుంచే షురూ చేస్తారట
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు మాత్రమే మొదటి ప్రయత్నంతోనే సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకోగా.. చాలా మంది వరుసగా సినిమాలు చేస్తున్నా సరైనా బ్రేక్‌ను దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో అక్కినేని హీరో అఖిల్ ఒకడు. వీవీ వినాయక్ తెరకెక్కించిన 'అఖిల్'తో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాలు చేశాడు. ఇవేమీ ఈ అక్కినేని హీరోకు హిట్ రుచిని చూపించలేదు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడీ యంగ్ హీరో.
ఇప్పటికే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటించిన అక్కినేని అఖిల్.. త్వరలోనే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. అలాగే, కొన్ని విభాగాల్లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. స్పై థ్రిల్లర్ కథతో రూపొందనున్న ఈ సినిమాలో అఖిల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూజా కార్యక్రమాలు మార్చి మొదటి వారంలో జరగనున్నాయట. ఆ వెంటనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందట.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరగనుందని తెలుస్తోంది. ఇందుకోసం మొదటి షెడ్యూల్‌లో భాగంగా చిత్ర యూనిట్ విమానం ఎక్కబోతుందని అంటున్నారు. ఎక్కువ శాతం ఏషియన్ కంట్రీల్లో ఈ మూవీ షూటింగ్ ఉంటుందని తెలిసింది. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా కన్నడ పిల్ల రష్మిక మందన్నా పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.