Ghost: ఒకే వేదికపై ముగ్గురు హీరోలు.. నాగార్జున ప్లాన్ అదిరిపోయిందిగా!

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్, ఫైట్స్ ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నారు. ఫలితంగా ఈ హ్యాండ్సమ్ హీరో ఫాలోయింగ్, మార్కెట్ భారీగా పెరిగిపోయింది. దీంతో అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నారు. ఇలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న ఆయన.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నారు.

ఈ ఏడాది ఆరంభంలోనే 'బంగార్రాజు' మూవీతో హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున.. ఇప్పుడు విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో 'ఘోస్ట్' అనే సినిమాను కంప్లీట్ చేసుకున్నారు. వాస్తవానికి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ, కొద్ది రోజుల తర్వాత ఇది పున: ప్రారంభించి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నారు. అంతేకాదు ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేశారు.

Akhil and Naga Chaitanya Chief Guests for Ghost Pre Release Event

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఘోస్ట్' సినిమాను అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సినిమా టీజర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. వీటికి అక్కినేని అభిమానులే కాకుండా.. అన్ని వర్గాల వాళ్ల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది. ఫలితంగా ఇవన్నీ ట్రెండింగ్ అయిపోయాయి. అదే సమయంలో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఘోస్ట్' మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 25న నిర్వహించబోతున్నారు. దీనికి కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్‌ను వేదికగా నిర్ణయించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం కాబోతున్న ఈ వేడుక కోసం ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఇక, ఈ ఫంక్షన్‌కు అక్కినేని ఫ్యామిలీకి చెందిన యువ సామ్రాట్ నాగ చైతన్య, హ్యాండ్సమ్ గాయ్ అఖిల్ గెస్టులుగా రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇక, ఒకే వేదికపై ముగ్గురు హీరోలు కనిపించబోతుండడంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

'ఘోస్ట్' మూవీలో అక్కినేని నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X