Just In
- 5 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 6 hrs ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 7 hrs ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 8 hrs ago
బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
Don't Miss!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల వైకుంఠపురములో సెన్సార్ పూర్తి.. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించని బడా చిత్రాలు
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వంటి బడా స్టార్లు సంక్రాంతి బరిలోకి దిగడానికి రెడీ అయ్యారు. అయితే బాక్సాఫీస్ మీద దాడి చేసేందుకు సమయాన్ని మాత్రం నిర్ణయించుకోలేదు. మొదటగా అనుకున్నట్లు సరిలేరు నీకెవ్వరు జనవరి 11, అల వైకుంఠపురములో జనవరి 12 తేదీల్లో వస్తారనుకున్నారు. అయితే వాటిలో మార్పులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

మొదటి నుంచి పోటీ..
సరిలేరు టీమ్‌కు, అల వైకుంఠపురములో టీమ్‌కు మొదట్నుంచీ ఏదో ఒక విషయంలో పోటీ వస్తూనే ఉంది. ఒకరు టీజర్ రిలీజ్ చేస్తే.. మరొకరు పాటలు రిలీజ్ చేయడం. మరోసారి పోస్టర్లతో హంగామా చేయడం.. అప్‌డేట్స్ కూడా ఒకే సమయానికి ఇవ్వడం ఇలా ప్రతీ ఒక్క విషయంలో పోటీ పడుతూనే ఉన్నారు. ఇలా చివరకు రిలీజ్ డేట్ విషయంలోనూ ఎవ్వరూ తగ్గడం లేదని తెలుస్తోంది.

ఎవరు ముందు వస్తారు.?
సంక్రాంతి సీజన్‌లో ముందు వచ్చినా.. వెనక వచ్చినా కంటెంట్ ఉండాలే గానీ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురుస్తుంది. అయితే మొదటగా వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఆ సినిమా ధాటికి వేరే చిత్రాలు నిలబడం కష్టమవుతుంది. ఈ క్రమంలో తామే ముందు వస్తామని ఇరు చిత్రాలకు సంబంధించిన వారు పట్టుబట్టినట్టు తెలుస్తోంది.

జనవరి 10న అంటూ..
ఈ రెండు చిత్రాల్లో ఒకటి మాత్రం కచ్చితంగా జనవరి 10న వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా చర్చలు జరుగుతూ ఉండటం వల్ల విడుదల తేదీలను ప్రకటించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా విడుదల చేస్తోన్న పోస్టర్లపై విడుదల తేదీ ప్రకటించకుండా.. సంక్రాంతికి వస్తున్నట్లు మాత్రమే వేస్తున్నారు.
|
సెన్సార్ పూర్తి అయినా..
సరిలేరు చిత్రానికి గురువారం సెన్సార్ పూర్తి కాగా.. అల వైకుంఠపురములో సినిమాకు నేడు సెన్సార్ పూర్తయింది. ఈ రెండు చిత్రాలకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది సెన్సార్ బృందం. అయితే ఈ రెండు చిత్రాలకు సెన్సార్ పూర్తి అయినా.. విడుదలలో మాత్రం తాత్సారం చేస్తూనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు థియేటర్లలోకి ఎప్పుడు వస్తాయా? అని ఇద్దరు హీరోల అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.