Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు.. ఫుల్ ఎంజాయ్! వీడియో వైరల్
సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలవుతుంది. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ పండగ సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. భార్య స్నేహారెడ్డితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

2020 కిక్ స్టార్ట్.. బన్నీ జోష్
గత సినిమా 'నా పేరు సూర్య' డిజాస్టర్ కావడంతో ఆయన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు బన్నీ ఫ్యాన్స్. వారి అంచనాలకు తగ్గట్టే ప్రమోషన్స్ ద్వారా జోష్ నింపిన అల్లు అర్జున్.. సినిమా విడుదలతో 2020 కిక్ స్టార్ట్ ఇచ్చారు.

పాజిటివ్ టాక్.. రికార్డుల మోత
'అల.. వైకుంఠపురములో' సినిమాకు తొలి షోనే పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్ నటన, త్రివిక్రమ్ టేకింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తూ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. రసవత్తర సంక్రాంతి పోటీలో నిలిచి విన్నర్‌గా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

అల్లు అర్జున్ ఇంట వెలుగులు.. ఎంజాయ్ మూడ్
దీంతో ఈ సంక్రాంతి అల్లు అర్జున్ ఇంట మరిన్ని వెలుగులు నింపింది. అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ మూడ్‌లో ఉన్నారు. జనవరి 15 సంక్రాంతి పండగ రోజు భార్య స్నేహారెడ్డితో కలిసి ఎంజాయ్ చేశారు. ‘అల వైకుంఠపురములో' సినిమాలోని పాటలు సింగర్స్ పాడుతుంటే హుషారెత్తిపోయారు అల్లు అర్జున్ జంట.

భార్యతో కలిసి హుషారుగా.. స్నేహారెడ్డి ఫీలింగ్స్
'సామజవరగమన' పాడుతుంటే అల్లు అర్జున్- స్నేహారెడ్డి ఫీలింగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ కార్యక్రమం అల్లు అర్జున్ ఇంట్లో జరిగిందా లేకపోతే వేరే చోట జరిగిందా అనేది తెలియలేదు. బట్ ఇందుకు సంబంధించిన వీడియోలో మాత్రం ఎంతో ఉత్సాహంగా తన భార్యతో కలిసి హుషారుగా కనిపించారు బన్నీ.
|
వీడియో షేర్ చేసిన అల్లు శిరీష్
ఈ వీడియోను అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ‘అల వైకుంఠపురములో' వసూళ్ల ప్రవాహం జోరు మీదుంది. మూడు రోజుల్లోనే 81 కోట్ల గ్రాస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కి అతిదగ్గరలో ఉంది.