Just In
- 4 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 1 hr ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
Don't Miss!
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రత్యేక విమానం.. బైక్ ర్యాలీలు.. టాప్ ఎక్కి అభివాదం.. ఓ రేంజ్‌లో బన్నీ హంగామా
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో ఏ రేంజ్‌లో దూసుకుపోతోందే అందరికీ తెలిసిందే. విపరీతమైన పోటీ ఉన్నా.. సంక్రాంతి బరిలోకి దిగి నెగ్గింది. బాక్సాఫీస్‌పై దాడి చేస్తూ రికార్డులన్నీ బద్దలుకొడుతోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్లా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేయగా.. ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లను రాబడుతోంది.

విజయోత్సవ వేడుకలు..
అల వైకుంఠపురములో చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు గానూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు వైజాగ్‌లో ఆర్కే బీచ్‌లో నేటి సాయంత్రం ఓ సభను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలేమో గానీ, వీటికంటే ముందు.. కొన్ని పనులు బన్నీ రేంజ్‌ను ప్రతిబింబించేలా చేస్తున్నాయి.

ప్రత్యేక విమానంలో..
వైజాగ్‌లో జరిగే ఈ వేడుకకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్, పూజా, త్రివిక్రమ్‌లతో కూడిన అల వైకుంఠపురంలో టీమ్ ప్రత్యేక విమానంలో బయల్దేరారు. వీటికి సంబంధించిన పిక్‌ను తమన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
అభిమానుల ర్యాలీలు..
వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అంతేకాకుండా బన్నీ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
|
కార్ టాప్ ఎక్కి అభివాదం..
వైజాగ్ చేరుకున్న బన్నీకి అభిమానలు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో భారీగా తరలివచ్చిన అభిమానుల కోసం బన్నీ కారుపైకి ఎక్కాడు. తనకోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశాడు. ఇవన్నీ చూస్తుంటే బన్నీ రేంజ్ మారిపోయినట్టు కనిపిస్తోంది.