Just In
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 1 hr ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
- 1 hr ago
మరోసారి మీ పాదాలను తాకాలని ఉంది.. ఎస్పీబీని తలుచుకుంటూ సునీత ఎమోషనల్
Don't Miss!
- News
ప్రపంచంలో తొలి సింగిల్ డోసు టీకా -జాన్సన్ అండ్ జాన్సన్ తయారీ కొవిడ్ వ్యాక్సిన్‌కు అమెరికా ఆమోదం
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల.. వైకుంఠపురములో: తమన్‌పై కామెంట్స్.. వేదికపైనే ఏడ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' మూవీ ఇటీవలే విడుదలై సూపర్ సాధించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై మాట్లాడిన యూనిట్ సభ్యులు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ని ప్రశంసల్లో ముంచెత్తారు. వివరాల్లోకి పోతే..

వైజాగ్‌లో విజయోత్సవ సభ.. అభిమానుల కోలాహలం
'అల.. వైకుంఠపురములో' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం విశాఖను వేదికగా చేసుకుంది చిత్రయూనిట్. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు అల్లు అర్జున్ సహా చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున బన్నీ అభిమానులు హాజరు కావడంతో వేదిక ప్రాంగణం కోలాహలంగా కనిపించింది.

అల.. వైకుంఠపురములో సక్సెస్.. మ్యూజిక్ పాత్ర
అల.. వైకుంఠపురములో సక్సెస్‌లో తమన్ అందించిన మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. విడుదలకు ముందే ఈ సినిమా పాటలు టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పి సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తమన్ గొప్పతనంపై చిత్రయూనిట్ అంతా స్పందించింది.

మంచి సినిమాకు మంచి సంగీతం తోడైతే.. అల్లు అరవింద్
వేదికపై మాట్లాడిన అల్లు అరవింద్.. ''2020 మొదలుకొని 2060 వరకు కూడా ఈ సినిమా పాటలు పాడుకుంటారు. ఒక మంచి సినిమాకు ఒక మంచి సంగీతం తోడైతే ఎంత గొప్పగా ఉంటుందనేది ఈ సినిమా రుజువు చేసింది. అప్పట్లో విడుదలైన శంకరాభరణం సినిమా పాటలు.. 40 ఏళ్లు గడిచినా ఇంకా పాడుకుంటున్నారు. ఈ సినిమా పాటలు కూడా అలాగే నిలిచిపోతాయి'' అన్నారు.

మాట నిలబెట్టుకున్నందుకు తమన్‌కు.. అల్లు అర్జున్
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''ఎలాంటి మ్యూజిక్ కావాలి బ్రదర్? అని తమన్ నన్ను అడిగాడు. వన్ బిలియన్ వచ్చే ఆల్బమ్ కావాలని చెప్పా. నిజంగా అలాంటి ఆల్బమే ఇచ్చాడు. మాట నిలబెట్టుకున్నందుకు తమన్‌కు కృతజ్ఞతలు. ‘సామజవరగమన' పాటతో సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనిపించుకున్నాడు. అలాగే, ‘రాములో రాములా'తో చాట్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ అనిపించుకున్నాడు'' అంటూ తమన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

టికెట్ కొంటారా కొనరా అని ఇబ్బంది పెట్టేంత.. త్రివిక్రమ్
ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను తన భుజం మీద మోసుకుంటూ మన ముందుకు తీసుకొచ్చారు తమన్. మనం కాలు కదపకుండా ఉండలేనంత, మన గుండెల్లోకి వచ్చేసి మీరు ఈ సినిమాకు వస్తారా రారా.. టికెట్ కొంటారా కొనరా అని ఇబ్బంది పెట్టేంత మంచి సంగీతాన్ని ఆయన అందించాడు. ఇంత ఆదరణ ఇన్ని కలెక్షన్స్ రావడానికి కారణం తమనే'' అన్నారు.
తమన్ ఆనంద భాష్పాలు
కాగా చిత్రయూనిట్ ప్రశంసలు, తన సంగీతంపై పాసిటివిటీ చూసి భావోద్వేగానికి గురయ్యాడు తమన్. వేదిక పై త్రివిక్రమ్ తన గురించి మాట్లాడుతున్నంత సేపు తమన్ ఆనంద భాష్పాలు కార్చడం విశేషం.