Just In
- 1 hr ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 1 hr ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 3 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- News
కిసాన్ పరేడ్ .. సింఘూ, తిక్రీ , ఘాజీపూర్ బోర్డర్ లో ఉద్రిక్తత .. పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం
- Sports
డబ్బుల కోసమే బెయిర్‌స్టో ఐపీఎల్ ఆడుతాడు.. డిక్విల్లా స్లెడ్జింగ్.. ఆ వెంటనే ఔట్! వీడియో
- Finance
మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRR షూటింగ్ అప్‌డేట్: ఎట్టకేలకు ఆమెను తీసుకొస్తున్న రాజమౌళి
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్, హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథ ఆధారంగా రాబోతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్.. లాక్‌డౌన్ వల్ల చాలా రోజుల పాటు ఆపేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నిర్వరామంగా చిత్రీకరణ జరుపుతున్నాడు జక్కన్న. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్‌లు కూడా పూర్తి చేసేశాడు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో శివారులో వేసిన భారీ సెట్‌లో సుదీర్ఘమైన షెడ్యూల్‌ను జరపబోతున్నారు. దీనికి బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ హాజరవుతుందని తాజా సమాచారం. ఇందుకోసం ఆమె నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఆలియా పరిచయ సన్నివేశాలు మాత్రమే షూట్ చేస్తారని అంటున్నారు. రామ్ చరణ్ కాంబినేషన్ సీన్లు కొంచెం ఆలస్యమయ్యే చాన్స్ ఉందట.

ఇదిలా ఉండగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గానూ, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగానూ నటిస్తున్నారు. వీళ్లిద్దరి పరిచయ వీడియోలకు ఊహించని రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాను 2021 జనవరి 8న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ.. అది సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఇది మరోసారి వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటులు ఒలీవియా మోరిస్, రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ, అజయ్ దేవగణ్, సముద్రఖని సహా ఎంతో మంది నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.