Allu Arjun స్నేహమంటే ఇదేరా : బన్నీ వాసు బర్త్ డే కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్

గత ఏడాది అల వైకుంఠపురములో హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప అనేసినిమా చేస్తున్నారు. సుక్కు సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్‌లోకి మారిపోయిన అల్లు అర్జున్ ప్రస్తుతం షూట్ లేకపోవడంతో రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అయితే ఈరోజు బన్నీ స్నేహితుడు బన్నీ వాసు పుట్టిన రోజు కావడంతో ఆయనకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

పుష్పతో బిజీ

పుష్పతో బిజీ

అల్లు అర్జున్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతానికి అన్ని సినిమాల లాగే ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో ఓ సినిమా చేయాల్సి ఉంది.

కొరటాల శివ కాంబో వెనక్కు

కొరటాల శివ కాంబో వెనక్కు

ఈ మేరకు గత ఏడాది అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అల్లు అర్జున్ కొరటాల కాంబినేషన్ లో సినిమా ప్రకటన వెలువడిన నేపథ్యంలో దాదాపు అందరూ పుష్ప తర్వాత అదే సినిమా ఉంటుందని భావించారు.. కానీ పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల సినిమా మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి.

వరుస లైనప్

వరుస లైనప్

అయితే పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, మొదటి భాగం రిలీజ్ అనంతరం బన్నీ ఐకాన్ సినిమాను సెట్స్ పైకి తేనున్నాడు. ఇక ఆ తరువాత పుష్ప 2 వస్తుందట. ఇక 23వ సినిమా ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో ఉంటుందట. అనంతరం 24వ సినిమాను బోయపాటి దర్శకత్వంలో పూర్తి చేసి 25వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో ఫినిష్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

ఫ్రెండ్ బర్త్ డే

ఫ్రెండ్ బర్త్ డే

అయితే ఈ విషయాలు అలా ఉంచితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న స‌న్నిహితుల్ని ఎంతో అప్యాయంగా చూసుకుంటూరనే విష‌యం తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో త‌న బెస్ట్ ఫ్రెండ్, ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీ వాసు అలియాస్ ఉదయ శ్రీనివాస్ గవర పుట్టిన రోజు సంద‌ర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెష‌ల్ అండ్ స్వీట్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. నిజానికి ప్ర‌తి ఏడాది ఈరోజున అల్లు అర్జున్, బ‌న్నీవాసుగారిని స్వ‌యంగా క‌లిసి పుట్టిన రోజు శుభ‌కాంక్ష‌లు తెలుపుతుంటారు.

ఏకంగా ముంబైకి

ఏకంగా ముంబైకి


కానీ ఈసారి ఒక అత్యవసర ప‌ని కోసం ముంబై వెళ్లారు బ‌న్నీవాస్. అయితే ప్రతియేటా వస్తున్నా సంప్రదాయాన్ని పక్కన పెట్టలేని అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి మ‌రీ త‌న బెస్ట్ ఫ్రెండ్ బ‌న్నీవాసుకి బ‌ర్త్ డే విషెస్ తెలిపి, ఓ స్వీట్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక దాదాపు 22 ఏళ్లుగా వీరిద్ద‌రి స్నేహ బంధం కొన‌సాగుతోంది.

బన్నీ వాసుకి సర్ప్రైజ్

బన్నీ వాసుకి సర్ప్రైజ్

ఇక అల్లు అర్జున్ తో పాటు త‌న‌య‌డు అయాన్, ప్ర‌ముఖ నిర్మాత‌లు యూవీ క్రియేష‌న్స్ వంశీ, కేధార్ లు కూడా బ‌న్నీ వాసుని క‌లిసి పుట్టినరోజు శుభ‌కాంక్ష‌లు తెలిపారు. ఇక ఎంతో బిజీగా ఉండే అల్లు అర్జున్ త‌న కోసం స్వ‌యంగా ఇంత దూరం వ‌చ్చి మ‌రీ ఈ విధంగా బ‌ర్త్ డే విషెస్ చెప్పడంతో బ‌న్నీవాస్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక బన్నీ వాసు నిర్మాతగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, 18 పేజెస్ సినిమాలు తెరకేక్కుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X