For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa song leak: కావాలనే లీక్ చేశారా?.. టెన్షన్ అవసరం లేదు.. మొత్తానికి సాంగ్ అయితే అదిరింది

  |

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. బన్నీ కెరీర్ లోనే మొదటిసారిగా చేస్తున్న ఈ భారీ ప్రయోగం ఎలాంటి సంచనాలనలు సృష్టిస్తుందో అని ఇప్పటికే అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ కూడా మొదటిసారి ఊర మాస్ యాక్షన్ సినిమాతో సరికొత్త బాక్సాఫీస్ అందుకోవాలని టార్గెట్ చేసుకున్నాడు.

  నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కుతున్న పుష్ప కాంబినేషన్ పై ఎప్పటికప్పుడు మంచి హైప్ ఐతే క్రియేట్ అవుతొంది. దానికి తోడు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా హడావిడి మొదలు పెట్టాడు. మొదటి సాంగ్ కు సంబంధించి ప్రోమో తోనే సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. అయితే గ్రాండ్ గా విడుదల కావాల్సి ఫుల్ సాంగ్ గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాంగ్ మొత్తం లీక్ అయినట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. అయితే ఇది కావాలని లీక్ చేశారనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

  ప్రతి చిన్న అప్డేట్ కూడా

  ప్రతి చిన్న అప్డేట్ కూడా

  దర్శకుడు సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతంలో విభిన్నమైన ప్రేమ కథలతో ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఇక మూడో సారి కలిసి వర్క్ చేస్తున్న ఈ కాంబినేషన్ తప్పకుండా మరో ప్రేమకథతోనే వస్తారని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఊర మాస్ యాక్షన్ సినిమా పుష్ప ను సెట్స్ పైకి తీసుకొచ్చారు. అల్లు అర్జున్ మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఉన్నట్లు అర్థమవుతోంది. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది. అభిమానుల్లో అంచనాలు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి

  ఒకేసారి ఐదు భాషల్లో

  ఒకేసారి ఐదు భాషల్లో

  సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ పై గత రెండు వారాల నుంచి దేవిశ్రీప్రసాద్ అయితే మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. RRR ప్రమోషనల్ సాంగ్ పాన్ ఇండియా భాషల్లో 5 మంది సింగర్స్ తో ఎలాగైతే విడుదల చేశారో అదే తరహాలో పుష్ప మొదటి పాటను కూడా గ్రాండ్ గా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. దాక్కో దాక్కో మేక.. అనే ఆ సాంగ్ ఫస్ట్ ప్రోమోతోనే ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఆడియెన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా దేవి శ్రీ ప్రసాద్ పాటలను కంపోజ్ చేసుకున్నాడు.

  దాక్కో దాక్కో మేక.. సాంగ్ లీక్

  దాక్కో దాక్కో మేక.. సాంగ్ లీక్

  సినిమా ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా పాటతోనే ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేయాలని చాలా బలంగా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమైంది. అయితే ప్రతి పెద్ద సినిమాకు ఏదో ఒక విషయంలో లీకుల బెడద తప్పదు. అలాగే పుష్ప విషయంలో కూడా అదే తరహాలో ఇబ్బందులు ఎదురవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 13న రావాల్సిన ఈ పాన్ ఇండియా సాంగ్ ఒకరోజు ముందే ఇంటర్ నెట్ వరల్డ్ లో లీక్ కావడం హాట్ టాపిక్ గా మారింది.. దాక్కో దాక్కో మేక తెలుగు సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ట్విట్టర్ ఫేస్ బుక్ వాట్సప్ వంటి వాటిల్లో పాట చక్కర్లు కొడుతోంది. అసలు ఈ విధంగా మొదటి పాట లీక్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

  కంగారు పడాల్సిన అవసరం లేదు

  కంగారు పడాల్సిన అవసరం లేదు

  అయితే పాటలు లీక్ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది ఎందుకంటే అది దేవి శ్రీ ప్రసాద్ పాడినట్లుగా ఉంది. అది కూడా ఒరిజినల్ సాంగ్ కాదు. సాధారణంగా పాట కంపోజ్ చేసినప్పుడు దాన్ని పూర్తిగా దేవి శ్రీ ప్రసాద్ పాడడం అలవాటు. ఇక ఈ పాట ఒరిజినల్ గా సింగర్ శివం పాడాడు. మిగతా భాషలకు సంబంధించిన పాట ఎక్కడ లీక్ అవ్వలేదు గాని కేవలం తెలుగు పాట మాత్రమే లీక్ అయింది. దేవిశ్రీప్రసాద్ పాడుతుండగా ఎవరో రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది.

  Allu Arjun Biography | Why Allu Arjun Is Biggest PAN India Star ? | Filmibeat Telugu
   పాట లీక్ పై అనుమానాలు..

  పాట లీక్ పై అనుమానాలు..

  అయితే ఈ తరహా లో పాటలు లీక్ ఇవ్వడంపై కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ప్రమోషన్ లో భాగంగా గతంలో చాలామంది ఇదేవిధంగా లీక్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక పుష్ప అలాంటి మ్యాజిక్ ఏదైనా క్రియేట్ చేసిందేమో అని టాక్ కూడా వస్తుంది. ఇక ఒరిజినల్ సాంగ్ అయితే సింగర్ శివమ్ పాడాడు కాబట్టే తప్పకుండా ప్రభావం చూపదని అర్థమవుతోంది. దీంతో పాట కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అసలైన అభిమానులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఇక శనివారం విడుదల కాబోయే ఈ పాట ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి. ఇక రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ చేయవచ్చని తెలుస్తోంది.

  English summary
  Allu arjun pan india movie Pushpa first song leak,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X