For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Allu Arjun: కేంద్ర మంత్రి చేతులమీదుగా అల్లు అర్జున్ కి అత్యున్నత అవార్డు.. అక్కడి నుంచి ఇదే తొలిసారి

  |

  టాలీవుడ్​లో ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన సుకుమార్​ డైరెక్షన్​లో నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తగ్దేది లే.. అనుకుంటూ పాన్​ ఇండియా స్టార్​గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. ఈ సినిమా అల్లు అర్జున్​కు​ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. పుష్ప చూసిన నార్త్​ ప్రేక్షకులు బన్నీ డైలాగ్స్​, నటన, డ్యాన్స్​కు ఫిదా అయ్యారు. అల్లు అర్జున్​ మేకవర్​, యాటిట్యూడ్​ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల అమెరికాలో గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించిన అల్లు అర్జున్ కు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది.

  ఎక్కడ చూసిన పుష్ప రాజ్ హవా..

  ఎక్కడ చూసిన పుష్ప రాజ్ హవా..

  ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది. సౌత్, నార్త్, ఇంటర్నేషనల్ అని ఏ తేడా లేకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది. గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ముఖ్యంగా దక్షిణాదిన బన్నీకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. పుష్ప రాజ్ నటనకు యావత్ ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. ఇక ఇప్పటికే పుష్ప సినిమాకు ఫిలీం ఫేర్ 67 అవార్డుల మహోత్సవంలో ఏకంగా 7 అవార్డులు రాగా, సైమా అవార్డులను కూడా వరించింది.

   అమెరికాలో గ్రాండ్ మార్షల్ గా..

  అమెరికాలో గ్రాండ్ మార్షల్ గా..

  ఇక ఇటీవల బన్నీ అమెరికాలో గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించి అరుదైన గౌరవాన్ని పొందాడు. తాజాగా మరోసారి అత్యున్నత అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఎంటర్టైన్ కేటగిరిలో CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు బన్నీ. సినిమా ఇండస్ట్రీలో గత 20 ఏళ్లలో ఉత్తరాది నుంచి దక్షిణ భారత నటుడుకి అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డుకెక్కాడు.

  మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా..

  మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా..

  ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలకు హాజరైన మహిళా, శిశు, సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. కాగా ఈ కేటిగిరీలో బన్నీతోపాటు రాజమౌలి (RRR), వివేక్ అగ్నిహోత్రి (ది కశ్మీర్ ఫైల్స్), అలియా భట్ (గంగూభాయి కతియావాడి), కార్తిక్ ఆర్యన్ (భూల్ భులయ్యా 2) నామినేట్ అయ్యారు. అయితే వీరందరిలోకి ఈ అవార్డుకు అల్లు అర్జున్ (పుష్ప) ను ఎంపిక చేసింది ఈ జ్యూరి.

  వాళ్లకు అంకితంగా..

  వాళ్లకు అంకితంగా..

  ఇక ఈ అవార్డు ఫంక్షన్ లో మోస్ట్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''నేను ఈ సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నేను సౌత్ నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నాను. కానీ నార్త్ నుంచి అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం'' అంటూ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ స్పీచ్ తో అక్కడ ఒక్కసారిగా అరుపులు, ఈలలు, చప్పట్లతో మారుమోగిపోయింది. అలాగే ఈ మూవీ కొవిడ్ సమయంలో విడుదైలనందున డాక్టర్లు, నర్సులు, ఆరోగ్యకార్యకర్తలు, వాలంటీర్లు, కొవిడ్ వారియర్లకు ఈ అవార్డును అంకితమిచ్చాడు అల్లు అర్జున్.

  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో..

  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో..

  కాగా అల్లు అర్జున్‌ హీరోగా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇక, 'పుష్ప ద రూల్'లో మరికొందరు ప్రముఖులు నటించబోతున్నారు.

  English summary
  Icon Star Allu Arjun Received CNN News18 Indian Of The Year 2022 Award From Union Minister Smriti Irani In The Category Of Entertainment For Pushpa Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X