Just In
- 3 min ago
ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడిపై బన్నీ స్పెషల్ ఫోకస్.. 13ఏళ్ళ తరువాత మళ్ళీ అతనితో చర్చలు!
- 8 min ago
మళ్లీ ఊపేసిన సాయి పల్లవి.. ‘సారంగదరియా’ వైరల్
- 46 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 1 hr ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
Don't Miss!
- Finance
సింగపూర్‌కు 2025 నాటికి 12 లక్షల మంది ఉద్యోగులు అవసరం
- Sports
India vs England: మొతెరా పిచ్‌ను నాగలితో దున్నుతున్నారు.. క్యురేటర్‌పై మైకేల్ వాన్ సెటైర్స్
- News
టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి అందలం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా?
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లు అర్జున్- సుకుమార్ టైటిల్ సీక్రెట్.. శేషాచలం, అరుణాచలం కాదు! అఫీషియల్ స్టేట్‌మెంట్
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'అల.. వైకుంఠపురములో' సూపర్ సక్సెస్ సాధించి 2020 సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చింది. దీంతో బన్నీ అభిమానుల్లో జోష్ పెరిగింది. బన్నీ అప్‌డేట్స్ నెటిజన్స్ తెగ వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ విశేషాలు, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ ప్రాజెక్టు టైటిల్ ఇదే అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ఇలాంటి వార్తలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. వివరాల్లోకి పోతే..

తొలిసారి బన్నీ జోడీగా రష్మిక మందన్న..
అల్లు అర్జున్ కెరీర్‌లో 20వ సినిమాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న తొలిసారి బన్నీతో జోడీ కడుతోంది. చిత్రంలో బన్నీ చిత్తూరు యాసతో మాట్లాడతారని, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని టాక్. బన్నీ అభిమానుల టేస్ట్‌కి తగ్గట్టుగా సుక్కు ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట.

శేషాచలం.. టైటిల్ ఫిక్స్
తర్వలో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు బన్నీ. గతంలో ఎన్నడూ ఏ హీరో చేయని డిఫెరెంట్ క్యారెక్టర్ బన్నీ కోసం రెడీ చేశారట సుక్కు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ 'శేషాచలం' అని ఫిక్స్ చేశారని, అతిత్వరలో ఈ టైటిల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అవన్నీతప్పుడు ప్రచారాలు.. నమ్మకండి
ఈ మేరకు తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. తాము ఇంతవరకూ ఏ టైటిల్ ఫిక్స్ చేయలేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు. ''కొన్ని వెబ్‌సైట్స్ టైటిల్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. సరైన టీమ్ చూసుకొని మేమే ఈ టైటిల్ అఫీషియల్‌గా ప్రకటిస్తాము. ఇప్పటివరకు వచ్చినవన్నీ రూమర్స్ మాత్రమే'' అని తెలిపారు.
|
శేషాచలం, అరుణాచలం కాదు..
ఈ పోస్ట్ చూసిన ఓ నెటిజన్ ''కథకి సరైన టైటిల్‌లా ఉంది శేషాచలం'' అని కామెంట్ చేయగా.. శేషాచలం, అరుణాచలం, భద్రాచలం, సింహాచలం లాంటి టైటిల్స్ అనుకోవడంలేదని చెప్పేశారు నిర్మాతలు. త్వరలోనే అఫీషియల్ టైటిల్ చెబుతామని అన్నారు.

రంగంలోకి రంగమ్మత్త.. సుకుమార్ స్కెచ్
ఇక ఈ మూవీలో అనసూయ కూడా కీలకపాత్ర పోషిస్తోందని మరో సమాచారం చక్కర్లు కొడుతోంది. సుకుమార్ గత సినిమా 'రంగస్థలం'లో రంగమ్మత్తగా ఇరగదీసిన అనసూయను మళ్ళీ ఈ సినిమా కోసం తీసుకున్నారని, రంగమ్మత్తను మరిపించేలా ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారని తెలుస్తోంది.