Who is Nayanika? అల్లు శిరీష్ కాబోయే భార్య ఎవరు? నయనిక బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
Allu Sirish Engagement: టాలీవుడ్ లో చాలామంది బ్యాచిలర్ హీరోలు ఉన్నారు. ఆ లిస్ట్ నుంచి మరో యంగ్ హీరో వైదొలగనున్నారు. అతి తర్వలో అల్లు వారి ఇంట్లో పెళ్లి బజాలు మోగనున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇంతకీ అల్లువారి కోడలు ఎవరు? వీరి నిశ్చితార్థం ఎప్పుడు? అనే వివరాల్లోకెళ్లే...
టాలీవుడ్ లో అల్లు కుటుంబం నుంచి మరో శుభవార్త వినిపించింది. యంగ్ హీరో అల్లూ శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అల్లు శిరీష్ త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ శుభవార్తను శిరీష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన ప్రేయసి నయనిక తో ఎంగేజ్‌మెంట్ జరగనుందని, ఈ నెల 31న నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిపారు.

శిరీష్ ఓ పోస్ట్‌లో 'మా తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా, నా మనసుకు బాగా దగ్గరైన విషయాన్ని మీతో పంచుకుంటున్నా. నేను, నయనిక ఈ నెల 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. నేను పెళ్లి చేసుకోవాలని మా నానమ్మ ఎప్పుడూ కోరుతుండేది. ఆమె ప్రస్తుతం మా మధ్య లేకపోయినా, తన ఆశీస్సులు మాపై ఉంటాయి'అని. ఈ సందర్భంగా ఆయన తన కాబోయే భార్యతో ఐఫిల్ టవర్ వద్ద దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్టుపై పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అందరికి ఆసక్తికరంగా ఉన్న అంశం ఏమిటంటే, నయనిక ఎవరు? తెలిసిన వివరాల ప్రకారం, ఆమె హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తె. అయితే, మరిన్ని వివరాలు, ఆమె ఫేస్ ఎప్పుడెప్పుడు బయటకు రాబోతోందో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సినీ కెరీర్ విషయానికి వస్తే.. శిరీష్ 2013లో 'గౌరవం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఊర్వశివో రాక్షసివో వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. చివరగా 'టెడ్డీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు, అయితే పెద్ద సక్సెస్ పొందలేక పోయారు. ఈ నిశ్చితార్థం వార్తతో మళ్లీ అల్లు శిరీష్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అభిమానులు, సినీ పరిశ్రమలోని స్నేహితులు శిరీష్-నయనిక జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అల్లు శిరీష్ గురించి మాట్లాడితే.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు బయట ప్రపంచానికి తెలియనివ్వడు. చాలా ప్రైవేట్‌గా ఉంచే వ్యక్తి. రిలేషన్‌షిప్‌లు, వ్యక్తిగత విషయాలను బయట పెట్టేరు. కానీ తన నానమ్మ కనకరత్నమ్మ మరణించిన తర్వాత శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రిబ్యూట్ మాత్రం చాలా మందిని కదిలించింది. ఆ పోస్టులో తన నానమ్మతో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇచ్చిన సీక్రెట్ పాకెట్ మనీ, తన తండ్రి కోపం నుంచి రక్షించడం, వేసవి రోజుల్లో ఆడుకుని వచ్చాక సున్నిపిండి రాసిన క్షణాలు అన్నీ ఆయనకు చాలా ప్రియమైన జ్ఞాపకాలు అని చెప్పారు. అలాగే చివరి రోజులలోనూ ఆమెతో గడిపిన సమయం తన జీవితంలో చాలా విలువైనదిగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆమెను చాలా మిస్ అవుతామని శిరీష్ భావోద్వేగంగా రాశారు.


Click it and Unblock the Notifications











