Don't Miss!
- News హైదరాబాద్ సిటీలో వర్షం: అటు ఎండలు.. ఇటు వానలు
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సైలెంట్‌గా నాలుగో సినిమా మొదలుపెట్టిన జూనియర్ దేవరకొండ.. దర్శకుడు ఎవరంటే?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఆనంద దేవరకొండ తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పటికే రెండు సినిమాలు చేసి, రెండు సినిమాలు రిలీజ్ చేసిన ఆయన మూడో సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమా కూడా మొదలు పెట్టారు. కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయిపోతున్న ఈ రోజుల్లో కూడా ఆనంద్ దేవరకొండ సినిమా ప్రారంభించేశాడు. తన మొదటి సినిమా 118 తోనే సూపర్ హిట్ సాధించిన దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నారు.
మాళవిక మోహనన్ క్లీవేజ్ షో.. మాస్టర్ హీరోయిన్ హాట్ ఫోటో గ్యాలరీ..
ఈ సినిమా టైటిల్ హైవే అని తెలుస్తోంది. వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా రోడ్ జర్నీ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఒక సైకో కిల్లర్ తరహా క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఈ రోజే సంస్థ ఆఫీస్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి సినిమాగా దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్ ఆ మొదటి సినిమాతోనే మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు.
ఆయన చేసిన రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ కూడా నేరుగా ఓటిటిలో రిలీజ్ అయినా అందులో నటనకు గాను ఆనంద్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ఆనంద్ పుష్పక విమానం అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలోనే గుహన్ దర్శకత్వంలో ఈ సినిమా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా థ్రిల్లర్ జానర్ కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.