అనుష్క శర్మపై విమర్శలు: భర్తతో కలిసి ఆ ఫోటోలో ఉండటమే కారణం!

By Bojja Kumar

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, విరాట్ కోహ్లి పెళ్లికి ముందు అనేక ట్రోల్స్ జరిగాయి. అనుష్క ఏదైనా మ్యాచ్‌కు హాజరైనపుడు ఇండియా ఓడిపోతే అంతా అనుష్కను ఆడిపోసుకునేవారు. నీ మాయలో పడి కోహ్లి సరిగా మ్యాచ్ ఆడలేకపోతున్నాడు అని విమర్శించేవారు. తర్వాత ఈ ఇద్దరూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా అనుష్క, విరాట్ మీద మరోసారి విమర్శలు వెళ్లువెత్తాయి. అందుకు కారణం... టీమిండియా అఫీషియల్ ఫోటోలో అనుష్క శర్మ దర్శనమివ్వడమే. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్‌‌లో భాగంగా ఇంగ్లాండ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే.

Anushka Sharma Trolled For Being With Virat Kohli In The Team India Picture!

లండన్‌లోని భారత హైకమిషన్‌ ఆహ్వానం మేరకు టీమ్ మొత్తం కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అనుష్క కూడా కోహ్లితో కలిసి అక్కడకు వెళ్లింది. ఇక్కడ టీమ్ అంతా కలిసి దిగిన ఫోటోను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. ఆ ఫోటోలో అనుష్క ఉండటంతో విమర్శలు మొదలయ్యాయి.

టీమిండియా అఫీషియల్ పర్యటనలో అనుష్క ఉండటం ఏమిటి? ఆమె ఏమైనా జట్టులో సభ్యురాలా? లేక టీమిండియా వైస్ కెప్టెనా? అంటూ కొందరు మండి పడ్డారు. మరికొందరైతే ఇది క్రికెట్ టూర్ మాదిరిగా అనిపించడం లేదని, కోహ్లి-అనుష్క హనీమూన్ టూర్ లా ఉందంటూ ఘాటుగా విమర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X