‘పవన్ కళ్యాణ్‌కి ఏది ఊరికే రాదు.. ఏది మనల్ని ఆపలేదు’

సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలకపాత్ర పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఓజీ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే భారీ అంచనాలున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వాషియో వాషి అంటూ ఫ్యాన్స్‌ను పలకరించారు.

నా లైఫ్‌లో ఆడియో ఫంక్షన్స్‌కి ఎప్పుడూ ఇలా రాలేదు. సుజిత్ చేసిన పనులకు సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్స్‌తో రావాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు మీకోసం. ఆకాశంలో విహరించే విలన్‌ని నేల మీదకు తీసుకొస్తానని చెప్పే పాటే వాషియో వాషి. నేను పాడాలని అనుకోలేదు, చెప్పాలని అనుకోలేదు తమన్ కోరిక. తమన్‌దే కాదు మీ కోరిక కూడా అని వాషియో వాషి పాటను వేదిక మీదే పాడారు పవన్ కళ్యాణ్. ఇమ్రాన్ హష్మితో కలిసి నటించడం నాకు దక్కిన గొప్ప అవకాశం.. జలక దికలాజా అంటూ దేశాన్ని ఉర్రూతలూగించిన పర్ఫార్మర్‌తో కలిసి పనిచేయడం నాకు ఆనందంగా ఉంది.

ఓజీని ఇంత ప్రేమిస్తారని నిజంగా నాకు తెలియదు, సుజిత్ నాకు మామూలు అభిమాని కాదు. జానీ సినిమా చూసి హెడ్ బ్యాండ్ కట్టుకుని నెలరోజులు తీయకపోతే వాళ్ల అమ్మగారు తిట్టి దాచేశారట. ఆ పిచ్చి పట్టుకుంది, సినిమా తీయాలి తీయాలని సాహో సినిమాను తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజిత్ అనే యంగ్ డైరెక్టర్ ఉన్నాడు.. మీరు చేస్తే చాలా బాగుంటుందని దానయ్య గారితో నాకు సుజిత్‌ని పరిచయం చేశాడు. సుజిత్ ఎక్స్‌ప్లెయిన్ చేసేది చాలా తక్కువ.. మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ముక్కలు ముక్కలుగా చెబుతాడు. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది.

AP Dy CM Pawan Kalyan s speech at They Call Him OG Concert Live

ఈ సినిమాకు ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్. ఒకరు సుజిత్.. తర్వాత అతని డ్రీమ్‌ని రియలైజ్ చేయడానికి తమన్. వీరిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్లు సినిమా అంతా ఒక ట్రిప్‌లో ఉన్నారు, వీళ్ల ట్రిప్‌లోకి నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే, నేను డిప్యూటీ సీఎం అనే సంగతి మరిచిపోయా ఈరోజు.. ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వస్తే ఎవరైనా ఊరుకుంటారా? సినిమాలో కాబట్టి చెల్లిపోయిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఖుషిలో ఖటానాని నేను ప్రాక్టీస్ చేశా.. దానిని వీళ్లు చూసి నాకిది కావాలి ఎలా చేద్దామా అని దీని చుట్టూ ఒక చక్కని కథ అల్లి సినిమాను చాలా బాగా తీశారు. డీవోపీ రవిచంద్ర గారు, మనోజ్ పరమహంస గారు చాలా బాగా వర్క్ చేశారు. ప్రియాంక గారు 80లలో ఉండే హీరోయిన్.. వీరిద్దరి మధ్య సినిమాలో అనుబంధం చాలా తక్కువసేపే ఉన్నప్పటికీ చాలా హృద్యంగా ఉంటుంది, మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుండు అనిపిస్తుందని పవన్ చెప్పారు. ఖుషి టైంలో ఇలాంటి జోష్‌ను చూశా.. సినిమాను వదిలేసి పాలిటిక్స్‌లోకి వెళ్లిపోయిన తర్వాత మీరు నన్ను వదల్లేదని నాకు అనిపిస్తోందన్నారు. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్‌లో కొట్లాడుతున్నానంటే అది మీరిచ్చిన బలం కదా.

నేను సినిమా ప్రేమికుడిని, సినిమా చేసేటప్పుడు నాకు వేరే ఆలోచన ఉండదు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు అన్నారు. నాకు జపనీస్ తెలియదు, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించారు. సుజిత్ దర్శక బృందానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఇలాంటి టీమ్ కనుక నేను డైరెక్షన్ చేసేటప్పుడు ఉండి ఉంటే నేను పాలిటిక్స్‌లోకి వచ్చేవాడిని కాదేమో అన్నారు పవన్ కళ్యాణ్. థమన్, మణిలు అద్భుతమైన సంగీతం అందించారు. ఇందులోని పాటలకు ఫారినర్స్‌‌ని ఏమైనా తీసుకొచ్చారా అని అడిగితే అందరూ తెలుగువాళ్లేనని థమన్ చెప్పారని గుర్తు చేసుకున్నారు.

ట్రైలర్ డీలే చేశారని అంటుంటే సంజయ్ సాహూకి ఏది తేలికగా రాదు అలాగే పవన్ కళ్యాణ్‌కి ఏది ఊరికే రాదు. అన్నింటిని అధిగమించి 25న వస్తున్నాం అన్నారు. ట్రైలర్ ఇంకా రెడీ కాలేదని డీఐ షాట్ ఒకటి చేయాల్సి ఉందని పవన్ తెలిపారు. అయినా వర్షం మనల్ని ఆపుద్దా.. ఏది మనల్ని ఆపింది ఇప్పటి వరకు, ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపాయా? వర్షం కూడా ఆపలేదని అభిమానుల్లో ఆయన ఉత్సాహం నింపారు. శ్రేయా రెడ్డి గారు ఒక ఆడ శివంగి, ఆవిడ ఫిట్‌నెస్ లెవల్స్ చూస్తే మతిపోద్ది, ఎవరైనా గొడవ పెట్టుకోవాలనుకుంటే పదిసార్లు ఆలోచించాలి. ఆవిడ పంచ్ పవర్ చాలా ఎక్కువ.. శ్రేయారెడ్డి గారితో భవిష్యత్తులో మళ్లీ కలిసి పనిచేస్తానని పవన్ కళ్యాణ్ ముగించారు.

More from Filmibeat

Read more about: pawan kalyan og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X