Just In
- 4 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 5 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒంటినిండా గాయాలతో రానా.. దగ్గుబాటి వారసుడి ఉగ్రరూపం! దాని కోసం బిగ్ ఫైట్
టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా సినీ జర్నీ ఆసక్తికరంగా ఉంది. పాత్ర నిడివితో సంబంధం లేకుండా, భాషా బేధం లేకుండా విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ఈ హీరో. బాహుబలి సినిమాలో భళ్లాలదేవగా నటించి దేశవ్యాప్త క్రేజ్ సంపాదించిన రానా.. అదే రేంజ్‌లో 'అరణ్య' సినిమాతో క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడు.

'అరణ్య' మూవీ.. దగ్గుబాటి రానా లీడ్ రోల్
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'హాథీ మేరే సాథీ'. తెలుగులో ఈ సినిమాను 'అరణ్య' పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇందులో దగ్గుబాటి రానా లీడ్ రోల్ పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి రానా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. ఇదే సినిమాను తమిళంలో ‘కాదన్'గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ మేరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్స్‌లో భళ్లాలదేవకు బాబులా కనిపిస్తున్నాడు దగ్గుబాటి రానా.

ఒంటినిండా గాయాలతో రానా.. ఉగ్రరూపం
గుబురు గడ్డం, ఒంటినిండా గాయాలతో అడవి జంతువుల మధ్య ఉగ్రరూపం దాల్చిన రానా ప్రేక్షకుల ముందుంచి ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు.
ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రానాతో పాటు జోయా హుస్సేన్, శ్రియా పిలగోన్కర్, పుల్‌కిత్ సామ్రాట్, విష్ణు విశాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

స్వార్థం కోసం ఇలా.. ధైర్యంగా ఎదురిస్తూ
నేటి సమాజంలో మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం జరుగుతోంది. దీంతో అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా 'అరణ్య' మూవీ తెరకెక్కింది.

ఇప్పటికే ఆలస్యమైంది.. బిగ్ ఫైట్
''ఈ సినిమా మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటోంది. కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయ్యాం. మీ ఎదురుచూపులను మరిపించేలా విలువైన ఫలితం మీరే చూస్తారు. అరణ్యాలను కాపాడుకునేందుకు ఇది బిగ్ ఫైట్'' అంటూ రానా 'అరణ్య' పోస్టర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
|
'అరణ్య' మూవీ
ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్ణిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత రసూల్ సౌండ్ ఇంజినీర్‌గా పనిచేయడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్డ్ ప్రొడక్షన్స్ పనులతో బిజీగా ఉంది. అన్ని భాషల్లో ఏప్రిల్ 2న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మరోవైపు రానా తన 'విరాటపర్వం' సినిమాతో బిజీగా ఉన్నాడు.