Just In
- 40 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అరణ్య టీజర్: మూగజీవాల రక్షకుడిగా రానా విన్యాసాలు
దగ్గుబాటి రానా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అరణ్య'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'హాథీ మేరే సాథీ' పేరుతో, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అరణ్యంలో జంతువులకు రక్షకుడిగా రానా నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ప్రభు సోల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది.
ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ ఇప్పటికే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకుంది. గుబురు గడ్డం, ఒంటినిండా గాయాలతో అడవి జంతువుల మధ్య ఉగ్రరూపం దాల్చిన రానా లుక్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో జనాల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. దీంతో ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్.

ఈ టీజర్ లో రానా ఆహార్యం, మూగజీవాల రక్షకుడిగా అతడి విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అడవిలో పక్షలు జంతు జాలానికి అర్థమయ్యే భాషలో రానా పిలుపు, ఆయన అమాయకత్వం, అదేవిధంగా మొరటుదనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక అతడి మాసిన జుత్తు.. ముఖంపై గాటు చూస్తుంటే అడవిలో భీకర పోరాటాలే చేస్తాడని అర్థమవుతోంది. బల్ దేవ్ పాత్రలో రానా నటిస్తున్నాడు. అడవిలో జంతువుల్ని సంహరించేవాళ్లతో బల్ దేవ్ పోరాటం తెరపై చూడనున్నామని తెలుస్తోంది.