Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ashoka Galla Hero Trailer: మహేష్ మేనల్లుడు సినిమాలో కూడా హీరోనే.. యాక్షన్ లో రొమాన్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. భలే మంచి రోజు, దేవదాస్, శమంతకమణి వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని అశోక్ గల్లా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సినిమా స్టిల్స్ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక ఈ సినిమా చాలా కాలం పాటు సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే.
అసలైతే గత ఏడాది లోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ పనులను చాలా సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక మొత్తానికి ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. జనవరి 14 వ తేదీన విడుదల కాబోయే ఈ సినిమా ట్రైలర్ ను కూడా నేడు విడుదల చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన హీరో ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమాలో కూడా హీరోగా ప్రయత్నం చేసే ఒక కుర్రాడికి అశోక్ గల్లా కనిపిస్తున్నాడు. అతని తండ్రి నుంచి నిరుత్సాహం, తల్లి నుంచి మద్దతు అందుతూ ఉంటుంది.

ఇక మరోవైపు జగపతిబాబు మెయిన్ విలన్ గా కనిపిస్తున్నారు. హీరో అవ్వాలని చాలామంది వారి జీవితాలను నాశనం చేసుకున్నారు అంటూ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నారు. అశోక్ గల్లా తండ్రి పాత్రలో నరేష్ రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కలలో బిర్యానీ వండుకుని తింటే కడుపు నిండదు అంటూ చాలా వెటకారం గా మాట్లాడే విధానం చూస్తుంటే విసిగించే ఫాదర్ పాత్రలో కనిపిస్తున్నాడని అర్థమవుతోంది. అయితే హీరో మరోవైపు వైపు హీరోగా ప్రయత్నం చేస్తునే హీరోయిన్ మనసును కూడా దోచేసుకున్నట్లు అర్థమవుతోంది.
హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమె గల్లా అశోక్ కు లిప్ లాక్ ఇవ్వడం విశేషం. ఇక తండ్రి దగ్గర నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పే విధానం ఆ తరువాత అతనే జగపతి బాబు అని అర్థమవుతుంది. చూస్తుంటే ఈ సినిమా మామ అల్లుళ్ల మధ్య కొనసాగే ఒక డిఫరెంట్ యాక్షన్ ఫిలింగా రాబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు నెగిటివ్ పాత్రలో డిఫరెంట్గా కనిపించబోతున్నారు.
ఇక వెన్నెల కిషోర్, సత్య వంటి ప్రముఖ కమెడియన్స్ కూడా ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ పాత్రలు చేసినట్లు అనిపిస్తుంది. యాక్షన్ రొమాంటిక్ కామెడీ తరహాలో ఉండే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ ను విడుదల చేసినట్లు క్లారిటీ ఇచ్చేశాడు. ఇది ఒక మంచి ఇంట్రడక్షన్ మూవీ అనే విషయాన్ని కూడా హీరో తనకు తానే హైలెట్ చేసుకోవడం విశేషం. మొత్తానికి ట్రైలర్ లో అయితే అన్ని రకాల అంశాలు ఉన్నట్లు చెబుతున్న హీరో మరి బాక్సాఫీసు వద్ద సంక్రాంతి పోటీలో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.