For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  10th Class Diaries మరో 96 మూవీ.. పదో తరగతిలోనే ఆ సినిమా చేశా.. అవికా గోర్ ఎమోషనల్

  |

  చిన్నారి పెళ్లికూతురు (బాలిక వధూ) ఫేమ్, సినీ, టెలివిజన్ నటి అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు 'హిప్ హాప్' తమిళ, హీరో ఆర్య ట్విట్టర్ ద్వారా టీజర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచయిత బీవీఎస్ రవి ఆవిష్కరించారు. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా

  సి. కళ్యాణ్ మాట్లాడుతూ "చిన్నాతో నాది 40 ఏళ్ల స్నేహం. నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు అతను మ్యుజిషియన్. చిన్నా నేపథ్య సంగీతం చేయడం అనేది నాతో మొదలైంది. నేను, శివమణి, ఎస్పీ బాలు, చిన్నా... మేమంతా బ్యాచ్. సినిమా ఇండస్ట్రీలో ఒక చేతికి ఇంకో చేయి తోడైతేనే సక్సెస్ వస్తుంది. ఒక్కడితో ఎప్పుడూ సక్సెస్ రాదు. మా గురువుగారు ఎప్పుడూ అదే చెప్పేవారు. నిర్మాత అచ్యుత రామారావు తమకు ఇంకో ముగ్గురు తోడయ్యారని చెబితే సంతోషం అనిపించింది. అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్ అంటే ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్ రాలేదు. తనకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. పనిలో అంజి చిచ్చరపిడుగు. రైటర్ దర్శకుడు అయితే... ప్రతి సీన్, డైలాగ్ మీద ప్రేమతో ఉంచుతారు. ఈ సినిమాకు అన్నీ మంచి సెంటిమెంట్స్ పడ్డాయి. మంచి హిట్టవ్వాలి" అని అన్నారు.

  Avika Gor emotional speech at Garuda Vega Anjis 10th Class Diaries teaser launch Event.

  ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ "సినిమాటోగ్రాఫ‌ర్‌గా అంజి 50 సినిమాలు చేశాడు. ఇప్పుడు డైరెక్షన్ అంటే నాకు కొంచెం కుళ్లుగా ఉంది. నాకు ఇంత అంత ధైర్యం రాలేదు. అంజికి అంత ధైర్యం ఉంది కాబట్టి... అతని సక్సెస్ లో మేమంతా అతని వెనుకాల ఉన్నాం. అంజిని చూస్తే... 'టెన్త్ క్లాస్ డైరీస్' తీసిన దర్శకుడిలా లేరు. బి. గోపాల్, వీవీ వినాయక్ - కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడిలా ఉన్నారు. వినాయక్ అంత కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎన్నో పెద్ద సినిమాలకు చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

  చిత్రనిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ.. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి మనిషి చూడాల్సిన సినిమా ఇది. ఆ అనుభూతులు గుర్తు వస్తాయి. అంజిగారు ఇరగదీశాడు. విజువల్ ఫీస్ట్. మేం అనుకున్న చిన్న పాయింట్‌ను ఆయ‌న బ్ర‌హ్మాండంగా తీశారు. అమెరికా, చిక్ మగళూరు, రాజమండ్రి, హైదరాబాద్... కాస్ట్లీ లొకేష‌న్స్‌లో సినిమా తీశాం. ఆడియ‌న్స్ విజువ‌ల్‌గా కూడా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ పరంగా సురేష్ బొబ్బిలి చించి అవతల పడేశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ చిన్న గారు చేశారు. మేం కథ అనుకున్నప్పుడు 'బాహుబలి' రైటర్ విజయ్ గారిని కలిశాం. ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. దర్శకుడు సుకుమార్ వద్ద పనిచేసే రైటర్ సుజీత్ డైలాగులు రాశారు. ఆయన ఇన్‌పుట్స్ క‌థ‌ను అందంగా మార్చాయి. అవికా గోర్, శ్రీరామ్, హిమజ, అర్చన, భానుశ్రీ... ఇలా ఆర్టిస్టులు అందరూ మాకు ఎంతో సహకరించారు. మొత్తం నలభై మంది ఆరిస్టులు ఉన్నారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్" అని అన్నారు.

  Avika Gor emotional speech at Garuda Vega Anjis 10th Class Diaries teaser launch Event.

  'గరుడవేగ' అంజి మాట్లాడుతూ "మా టీజర్ విడుదల చేసిన ప్రముఖులు అందరికీ ధన్యవాదాలు. ఎస్ఆర్ మూవీ మేకర్స్ రామారావు గారు, రవితేజగారు మంచి కథతో నా దగ్గరకు వచ్చారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా నా 50వ‌ సినిమాకు నేను డైరెక్షన్ చేయాలనే డ్రీమ్ నాకు లేదు. మా నిర్మాతలకు వచ్చింది. కథ విన్నాను. సుజీత్ మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. నాకు పూర్తిగా సహకరించిన సురేష్ బొబ్బిలి, చిన్నా, ప్రవీణ్ పూడి, ఇతరులు అందరికీ థాంక్స్. ఈ సినిమాకు అవికా గోర్ పెద్ద ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో ఆవిడ పెర్ఫార్మన్స్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. రామారావుగారు చెప్పినట్టు ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం పెరిగింది. ఆయనకు మద్దతుగా రవి, అజయ్ మైసూర్ వచ్చారు. '96', 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'కొత్త బంగారు లోకం' కోవలో 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమా ఉంటుంది" అని అన్నారు.

  అవికా గోర్ మాట్లాడుతూ "నా టెన్త్ క్లాస్ నాకు ఎంతో స్పెషల్. పదో తరగతిలో ఉన్నప్పుడు 'ఉయ్యాలా జంపాలా' చేశా. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేశారు. అందువల్ల, పదో తరగతి నాకెప్పుడూ గుర్తు ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమా చూసి మీరంతా ఎలా ఉందో చెబుతారని ఆశిస్తున్నాను. నన్ను బబ్లీ, చబ్బీ రోల్స్‌లో చూశారు. ఈ రోల్ చాలా డిఫరెంట్ " అని అన్నారు.

  English summary
  Crazy Mass Song 'Silaka Silaka' from Popular Cinematographer 'Garudavega' Anji's direction debut '10th Class Diaries'. This movie teaser released by Producer C Kalyan and Cinematographer Chota K naidu. Avika Gor emotional speech at Garuda Vega Anji's 10th Class movie Diaries teaser launch Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X