48 గంటల్లోపు 4 మిలియన్ల వ్యూస్.. నాగ చైతన్య ట్వీట్
ఫిదా వంటి కూల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన శేఖర్ కమ్ముల మరో ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు. మళ్లీ సింగిల్ పీస్.. భానుమతితో మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యాడు. సాయి పల్లవి, నాగ చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన ఏ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఏ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ క్లిక్ అయిన సందర్భంగా.. దర్శకుడు శేఖర్ కమ్ములకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంపోర్టెడ్ కళ్లజోడును తీసుకొచ్చి శేఖర్ కమ్ములకు ఇవ్వడంతో.. వాటిని పెట్టుకుని తెగ మురిసి పోయాడు. మరో టీజర్ రాబోతోంది.. గిఫ్ట్ రెడీ చేసి పెట్టుకో అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. అంతలా ఈ ప్రివ్యూ క్లిక్ అయింది.

సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఈ ప్రివ్యూలో చివర్లో వచ్చిన షాట్ అదిరిపోయిందని, అది ఎప్పుడూ తన మైండ్‌లోనే ఉంటుందని సమంత ట్వీట్ చేయడం తెలిసిందే. ఆ ముద్దు సీన్ ప్రివ్యూకే హైలెట్‌గా నిలిచింది. అందర్నీ ఆకట్టుకున్న ఈ ప్రివ్యూ 48 గంటలు తిరక్కుండానే నాలుగు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నట్లు చైతన్య ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











