Baahubali: భళ్లాలదేవుడి పాత్రకు ఫస్ట్ చాయిస్ రానా కాదా? మరెవరో తెలుసా?
Baahubali: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా ఈ సినిమా సంచలన రికార్డులను సృష్టించింది. ఇక భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుపైకి ఎక్కించింది 'బాహుబలి 2: ది కన్క్లూజన్'. బహుబలి 1 కు సిక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకుపైగా వసూళ్లు చేసి, ప్రపంచ సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి సినిమా గురించి ముఖ్యంగా భళ్లాలదేవుడి పాత్ర విషయంలో చేసిన సెలక్షన్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కథేంటీ?
బాహుబలి.. ఈ సినిమా సృష్టించిన సంచనలం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇండియన్ సినిమా స్థాయిని ఒకేసారి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందీ మూవీ. రాజమౌళి అద్భుత దర్శకత్వం, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యదేవ్‌ల నటన అద్భుతం. ప్రతి పాత్రను అద్భుతంగా మలిచారు. జక్కన్న. ముఖ్యంగా బహుబలి పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. రాజు పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయారు. రాజు అంటే ఆయనే అన్నట్లుగా ఈ చిత్రంలో నటించాడు. అలాంటి బలమైన పాత్రకు ప్రతి నాయకుడు భళ్లాలదేవుడు. ఈ పాత్ర కూడా బాహుబలి విజయానికి మరో ప్రధాన కారణమైందని చెప్పాలి. రానా భళ్లాలదేవుడిగా తెరపై కనబడిన తీరు, ప్రభాస్‌తో పోటీగా కనిపించిన మాస్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే.. భళ్లాలదేవుడి పాత్రకు ఫస్ట్ చాయిస్ రానా కాదంట.

రాజమౌళి బాహుబలి కథ ఆలోచన వచ్చిన వెంటనే హీరోగా ప్రభాస్‌ను అనుకున్నారు. దీంతో వెంటనే ప్రభాస్ దగ్గరకు వెళ్లి.. "డార్లింగ్ నీతో ఒక పెద్ద సినిమా చేయాలనుకుంటున్నా. అది రాజుల కథ, యుద్ధానికి వెళ్లి గాయం లేకుండా తిరిగొచ్చే యోధుడు'బాహుబలి'" అని కథ చెప్పగానే ప్రభాస్ వెంటనే అంగీకరించాడట. కానీ, ఈ సినిమాకి ప్రతినాయకుడి ఎంపిక మాత్రం అంత సులభం కాలేదట. ప్రభాస్‌కు తగ్గ పర్సనాలిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడిని వెతకడంలో మూవీ మేకర్స్ పడ్డారంట. ఈ క్రమంలో ఓ హాలీవుడ్ హీరో పేరు తెరపైకి వచ్చిందట. ఈ హీరో ఎవరో కాదు.
'గేమ్ ఆఫ్ థ్రోన్స్','ఆక్వామెన్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు జేసన్ మమోవా (Jason Mamoa)పేరును పరిశీలించారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్య్వూలో నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించారు. ఆ హాలీవుడ్ హీరోను సినిమాలోకి తీసుకుంటే.. ఇంటర్నేషనల్ లెవెల్ ఫీల్ వస్తుందని భావించారు. కానీ, బడ్జెట్ ఎక్కువ, అలాగే.. భారతీయ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే నటుడ్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారంట. అప్పుడు రానా దగ్గుబాటి గుర్తుకు వచ్చారంట. ఆ తరువాత రానాను సంప్రదించడం, కథ చెప్పడం, అతడికి కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాంట.
అయితే.. రానా కథ ఒకే చేసి ముందుకు సరదాగా "నాకంటే ముందు ఎవరిని అనుకున్నారు?" అని అడిగారట. "జేసన్ మమోవా" అని శోభు చెప్పగా.. రానా నవ్వేసి, "అయితే నేను చేస్తా!" అని వెంటనే ఓకే చెప్పారట. ఇలా ఫైనల్ గా రానా భళ్లాలదేవుడిగా తెరపై కనిపించారు. ఈ సినిమా అటు ప్రభాస్ కెరీర్ లోనే కాదు.. రానా కెరీర్ లో కూడా ఓ మైల్ స్టోన్ మూవీగా మారింది. వాస్తవానికి బాహుబలి ఒక సినిమా మాత్రమే కాదు.. భారతీయ సినీ ప్రపంచాన్ని మార్చిన ఓ ఉద్యమం. ఈ చిత్రంతో ప్రభాస్, రానా, రాజమౌళి పేర్లు అంతర్జాతీయ స్థాయిలో చెక్కుచెదరని ముద్ర వేయబడ్డాయి.


Click it and Unblock the Notifications











