Don't Miss!
- News
బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్ పంపిన యోగి ఆదిత్యనాథ్: మహిళపై దాడే కారణం
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Lifestyle
మీ వంటగదిలో ఉండే ఈ 8 వస్తువులు మీ జుట్టును పొడవుగా మరియు మెరిసేలా చేయగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
NBK107: బాలయ్య మూవీలో హైలైట్ లీక్.. మలుపు తిప్పేది ఆ పాత్రేనట
నందమూరి తారక రామరావు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగారు. అలా సుదీర్ఘ కాలంగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదే సమయంలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో బాలయ్య వరుస పరాజయాలతో సతమతం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత ఏడాది ఆయన 'అఖండ' అనే సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
షర్ట్ విప్పేసి మరీ సమీరా రెడ్డి అందాల ఆరబోత: ఎన్టీఆర్ హీరోయిన్ ఇలా మారిందేంటి!
'అఖండ' విజయం సాధించడంతో ఫుల్ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. ఈ ఉత్సాహంతోనే టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'జై బాలయ్య' (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమాలో నటిస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో రియల్ స్టోరీల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. వాస్తవానికి ఈ భారీ ప్రాజెక్టు ఎప్పుడో మొదలు కావాల్సి ఉన్నా.. మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రారంభించలేదు. ఇక, ఫిబ్రవరి నుంచే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసింది. ఇలా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా వరకూ షూటింగ్ పూర్తైంది.

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమ్మె కారణంగా చిత్రీకరణలు ఆగిపోయాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ పూర్తైన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇదంతా ఎంతో చక్కగా వచ్చినట్లు, ఈ సినిమా రష్‌పై యూనిట్ మొత్తం సంతృప్తిగా ఉన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలోని ఓ హైలైట్ పాయింట్ లీకైంది.
నువ్వు వర్జిన్‌వేనా అంటూ అషు రెడ్డికి నెటిజన్ ప్రశ్న: ఇండైరెక్టుగా బదులిచ్చిన బ్యూటీ
ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా ఉంటుందట. దానికి ముందే వచ్చే ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ మరింత ఆసక్తిని రేకెత్తించే విధంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌లోనే అప్పటి వరకూ బాలయ్య వెనకాలే ఉండి మంచోడిగా ఉన్న ఓ పాత్ర.. అప్పుడే నెగెటివ్ షేడ్స్ ఉన్నట్లుగా మారిపోతుందట. దీంతో సినిమా కథే మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. ఈ ట్విస్ట్ రివీల్ అయిన సమయంలో వచ్చే సన్నివేశాలు గూస్‌బమ్స్ తెప్పించే విధంగా ఉంటాయట. దీనికి థమన్ కూడా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ డిజైన్ చేస్తున్నాడని తెలిసింది.
ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక, దీని నుంచి వచ్చిన టీజర్‌కు భారీ స్పందన వచ్చింది.