twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda Vs GodFather మెగా, నందమూరి ఫ్యాన్స్ కలెక్షన్ల వార్.. చిరంజీవి, బాలకృష్ణ‌పై దారుణంగా ట్రోల్స్

    |

    టాలీవుడ్‌లో అగ్ర హీరోల మధ్య కలెక్షన్ల వార్ మొదలైంది. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి హీరోల సినిమాలు రిలీజైనప్పుడు అందరి దృష్టి కలెక్షన్లపైనే ఉంటుంది. కొన్నేళ్లుగా టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య బాక్సాఫీస్ రిపోర్టులపై భారీగానే చర్చ జరుగుతూ వస్తున్నది. సోషల్ మీడియా బలంగా ఉన్న ప్రస్తుత సమయంలో ఇటీవల రిలీజైన అఖండ, గాడ్‌ఫాదర్ చిత్రాల మధ్య ఫస్ట్ డే కలెక్షన్లను పోల్చుకొంటూ భారీ చర్చ జరుగుతున్నది. మెగా, నందమూరి అభిమానుల మధ్య జరుగుతున్న రచ్చ ఏమిటంటే?

    తక్కువ ధరకే అఖండ రిలీజ్

    తక్కువ ధరకే అఖండ రిలీజ్

    నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ప్రత్యేకమైన పరిస్థితుల్లో రిలీజైంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ టికెట్ల రేట్ల పెంపుకు అనుమతించకపోవడంతో తక్కువ ధరకే అఖండ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అతి తక్కువ టికెట్ ధరకే బాలకృష్ణ మూవీ భారీ వసూళ్లను తొలి రోజు నమోదు చేసింది. అఖండ తొలి రోజున 16 కోట్లకుపైగా షేర్‌ను సాధించింది.

    తక్కువ థియేటర్లలో గాడ్‌ఫాదర్

    తక్కువ థియేటర్లలో గాడ్‌ఫాదర్


    ఇక ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత చిరంజీవి నటించిన చిత్రం గాడ్‌ఫాదర్ రీమేక్ చిత్రం కావడంతో భారీ రిలీజ్‌‌కు దూరంగా ఉన్నారు. ఈ సినిమాను తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో మొత్తం 715 స్క్రీన్లలో మాత్రమే రిలీజ్ చేశారు. అయినా థియేటర్ కౌంట్‌ పరిమితంగా ఉన్నప్పటికీ సుమారు 13 కోట్లతో భారీ వసూళ్లును నమోదు చేసింది.

     అఖండ వర్సెస్ గాడ్‌ఫాదర్

    అఖండ వర్సెస్ గాడ్‌ఫాదర్


    తెలుగు రాష్ట్రాల్లో అఖండ చిత్రం కొన్ని ప్రాంతాల్లో భారీగా వసూలు చేస్తే.. కొన్ని ప్రాంతాల్లో గాడ్‌ఫాదర్ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆంధ్రాలో ఫస్ట్ డే కృష్ణా జిల్లాలో అఖండ 80 లక్షల షేర్ రాబడితే.. గాడ్‌ఫాదర్ 72 లక్షలు షేర్ నమోదు చేసింది. గుంటూరులో గాడ్‌ఫాదర్ 1 కోటికపైగా షేర్ సాధిస్తే.. అఖండ 78 లక్షలు నమోదు చేసింది. కర్నూలు సిటీలో అఖండ 25 లక్షకులపైగా షేర్ సాధిస్తే.. గాడ్‌ఫాదర్ 24 లక్షల షేర్ సాధించింది. ఏలూరులో గాడ్‌ఫాదర్ 18 లక్షలు, అఖండ 13 లక్షలు, అనంతపురంలో గాడ్‌ఫాదర్ 24 లక్షలు, అఖండ 22 లక్షలు రాబట్టింది.

     నైజాంలో చిరంజీవికి ఎదురుదెబ్బ

    నైజాంలో చిరంజీవికి ఎదురుదెబ్బ


    ఇక నైజాం విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవికి నైజాం బాక్సాఫీస్ అడ్డ. గత రెండు దశాబ్దాలుగా నైజాంలో కలెక్షన్ల వసూళ్లలో ఆయనే కింగ్. అయితే గాడ్‌ఫాదర్ సినిమా విషయానికి వస్తే.. నైజాంలో కలెక్షన్లు భారీగా తగ్గాయి. అఖండ చిత్రం నైజాంలో 4.39 కోట్లు కలెక్ట్ చేస్తే.. గాడ్‌ఫాదర్ 3.23 కోట్లు రాబట్టింది. ఖమ్మంలో అఖండ చిత్రం 19 లక్షల షేర్ సాధిస్తే.. గాడ్‌ఫాదర్ 8.25 లక్షలు నమోదు చేసింది.

    బాలయ్యనే కలెక్షన్ కింగ్ అంటూ


    అయితే గాడ్‌ఫాదర్ సినిమా కలెక్షన్లు తగ్గడంతో నందమూరి ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తక్కువ టికెట్ ధరకే అఖండ చిత్రం భారీ కలెక్షన్లతో సంచలనం రేపింది. టికెట్ రేట్లు పెంచుకొని కూడా గాడ్‌ఫాదర్ మూవీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. నందమూరి బాలకృష్ణ మాత్రమే కలెక్షన్ కింగ్ అంటూ మెగా ఫ్యాన్‌ను బాలయ్య, నందమూరి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

    చిరంజీవిని కలలో కూడా టచ్ చేయలేరు..


    అయితే.. నందమూరి, బాలయ్య ఫ్యాన్స్‌కు చిరంజీవి, మెగా అభిమానులు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. 2021లో రిలీజైన అఖండ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు మాత్రమే. చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ.. 2017లో రీమేక్ చిత్రం ఖైదీ నంబర్ 150తో 101 కోట్ల షేర్ సాధించాడు. ఇక 2019లో సైరా నర్సింహరెడ్డితో 141 కోట్ల షేర్ సాధించాడు. మీ హీరోకు మెగాస్టార్ స్థాయికి చేరుకోవడం కలలో కూడా సాధ్యపడదు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

    English summary
    Akhanda Vs GodFather : Balakrishna Fan war with Chiranjeevi's over Godfather day 1 collections worldwide. Fans are comparing Akhanda Collections with Godfather.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X