Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వీరసింహారెడ్డి ఇంటర్వెల్ లీక్: నరాలు కట్ అయ్యే ట్విస్ట్‌తో ఊచకోత
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తోన్న ఆయన.. గత ఏడాది 'అఖండ' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న తర్వాత రెట్టించిన ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్నారు. ఇలా ఇప్పటికే యంగ్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే యాక్షన్ మూవీని చేస్తున్నారు.
Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!
ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఈ ఏడాది మొదట్లోనే ఆరంభమైంది. అప్పటి నుంచి ఇది శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి రెడీ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

పల్నాడు బ్యాగ్‌డ్రాప్‌లోని రియల్ స్టోరీతో రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో రూపొందిస్తోన్నారు. ఇందులో బాలయ్య డుయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా ఉండబోతుందట. ఇందులో అసలు బాలకృష్ణ ఎవరు? శృతి హాసన్‌కు అతడికి ఉన్న రిలేషన్ ఏంటి? అనే విషయాలు రివీల్ చేస్తారని తెలిసింది. ఈ ట్విస్ట్ నరాలు కట్ అయ్యేంత షాకింగ్‌గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, దాని తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ పూనకాలు తెప్పించే విధంగా ఉంటుందని సమాచారం.
Revanth Remuneration: రేవంత్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్.. ప్రైజ్ మనీతో కలిపితే.. చేతికొచ్చింది మాత్రం!
'వీరసింహారెడ్డి' చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది.