For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒక్క రోజు లేటైనా చచ్చిపోయేవాడిని.. ఆ హీరో నాకు ప్రాణం పోశాడు: బండ్లగణేష్

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి నిర్మాత వారం వరకు సక్సెస్ ఫుల్ గా వచ్చిన అతి కొద్ది మందే నటీనటుల్లో బండ్ల గణేష్ ఒకరు. మొదట చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన బండ్ల గణేష్ కొన్నాళ్ళకు ప్రొడక్షన్ స్టార్ట్ చేసే భారీ స్థాయిలో విజయాలను అందుకున్నాడు. బండ్ల గణేష్ నిర్మాతగా మొదట్లోనే అగ్రహీరోలతో వర్క్ చేశాడు. దీంతో అతనికి స్టార్ ప్రొడ్యూసర్ గా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కింది. అయితే గత కొన్నాళ్లుగా సినిమాలు నిర్మించేందుకు వెనుకడుగు వేస్తున్న బండ్లగణేష్ మళ్లీ పవర్ ఫుల్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అయితే సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ కొన్ని ఇంటర్వ్యూలతో జనాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఒక చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు అందుకు సంబంధించిన ప్రోమో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఆ సినిమాతో జీవితమే మారిపోయింది

  ఆ సినిమాతో జీవితమే మారిపోయింది

  2009లో ఆంజనేయులు సినిమా ద్వారా నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన బండ్ల గణేష్ మొదటి రెండు సినిమాలతో మాత్రం ఊహించని విధంగా అపజయాలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో తీసిన తీన్మార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో నష్టాలకు గురి చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే మరొక సినిమా చేశాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన దబాంగ్ సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో బండ్ల గణేష్ జీవితమే మారిపోయింది.

  ఆఖరి సినిమా అదే

  ఆఖరి సినిమా అదే

  గబ్బర్ సింగ్ అనంతరం బాద్షా, ఇద్దరమ్మాయిలతో,

  గోవిందుడు అందరివాడేలే.. వంటి డిఫరెంట్ సినిమాలను తెరపైకి తీసుకువచ్చాడు. ఇక 2015లో టెంపర్ సినిమాతో మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అనంతరం బండ్ల గణేష్ నిర్మాతగా అడుగులు వేయలేదు. ఎక్కువగా రిస్క్ చేయకూడదు అనుకున్నాడో ఏమో గాని నమ్మకమైన కథ వచ్చేవరకు ప్రొడక్షన్ వైపు అడుగులు వేయకూడదని డిసైడ్ అయ్యాడట. ఇక చిన్న సినిమాలను కూడా తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడు కాని ఎందుకో వర్కవుట్ కాలేదు.

  రాజకీయాలకు దూరంగా..

  రాజకీయాలకు దూరంగా..

  ఇక నిర్మాతగా కొంతకాలం గ్యాప్ ఇచ్చిన బండ్ల గణేష్ ఆ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేదు అనుభవాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక తొందరపాటుగా మాట్లాడడం వలన బండ్ల గణేష్ ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత మళ్లీ రాజకీయాలకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాడు. వీలైనంత వరకు సినిమాలతో బిజీ అవ్వాలని అనుకున్నాడు. చాలా కాలం తర్వాత చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక కామెడీ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాత్రతో మంచి గుర్తింపు అందుకున్నాడు.

  ప్రాణాలు పోయేవి..

  ప్రాణాలు పోయేవి..

  ప్రస్తుత బండ్ల గణేష్ కు నటుడిగా మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ తనకు నచ్చితేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నాడు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే బండ్ల గణేష్ ఎలాంటి ఇంటర్వ్యూ ఇచ్చిన కూడా అందులో తన మాటలతో సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనాకు సంబంధించిన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ఒక్కరోజు ఆలస్యమైనా కూడా తన ప్రాణాలు పోయేవి అని అలాంటి కఠిన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి తనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చాడు.

  మెగాస్టార్ నాకు మరో ప్రాణం పోశారు

  మెగాస్టార్ నాకు మరో ప్రాణం పోశారు

  బండ్ల గణేష్ మాట్లాడుతూ. మెగాస్టార్ లేకపోయి ఉంటే నేను అసలు ప్రాణాలతో ఉండే వాడిని కాదు. నాకు కరోనా వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. ఇంట్లో వాళ్లకు కూడా పాజిటివ్ వచ్చింది. అనగానే మరింత వణికిపోయాను. ఆ సమయంలో పెద్ద పెద్ద వాళ్లను కలిసిన కూడా కనీసం హాస్పిటల్ లో ఒక బెడ్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేయాలని అనుకున్నాను కానీ అప్పుడు ఆయన కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నట్లు అర్థమైంది. ఇక వెంటనే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేయగానే ఒక్క ఫోన్ కాల్ తో నాకు సహాయం చేశారు. దాదాపు కరోనా తీవ్రస్థాయిలో విషమించింది అనుకుంటున్న సమయంలోనే మెగాస్టార్ దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు బండ్ల గణేష్ నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు అంటే అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి అని ఇచ్చాడు.

  బండ్ల గణేష్ రీ ఎంట్రీ

  బండ్ల గణేష్ రీ ఎంట్రీ

  పవన్ కళ్యాణ్ నాకు ఒక జీవితాన్ని ఇస్తే మెగాస్టార్ చిరంజీవి మరొక విధంగా ప్రాణాలు కాపాడారని ఆ విధంగా సహాయం చేసిన ఇద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని బండ్ల గణేష్ తెలియజేశాడు. అలాగే ఆ ఇంటర్వ్యూ లో బండ్ల గణేష్ మా ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక మళ్ళీ నిర్మాతగా కూడా భారీ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఒక కమిట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. మంచి దర్శకుడు పవర్ఫుల్ కథతో సిద్ధమైతే వెంటనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని కూడా బండ్ల గణేష్ ఆలోచిస్తున్నాడు. మరి ఆ రీ ఎంట్రీలో బండ్ల గణేష్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

  English summary
  Bandla ganesh about megastar helping in corona pandemic,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X