For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేవినేని బయోపిక్ అంటే నిప్పుతో చెలగాటమే.. ఆ ధైర్యం ఉందా?..

  |

  బెజవాడలో దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య కథా నేపథ్యంతో ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి తారకరత్న హీరోగా, జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న చిత్రం 'దేవినేని. బెజవాడ సింహం అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత డియస్ రావు దేవినేని ఆడియోను విడుదల చేశారు. ఈ చిత్రం లో నటించిన తుమ్మల పల్లి రామ సత్యనారాయణ, బాక్పాఫీస్ చందు రమేష్, లక్ష్మీ నివాస్, లిరిక్ రైటర్ మల్లిక్, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

   Bezawada Politician Devineni Nehru Biopic Audio released

  ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ...దేవినేని సినిమా గురించి విజయవాడ నుంచి నాకు కొంతమంది నాయకులు ఈ సినిమా ఆపేయమని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.నేను అందరికి తెలియజేసేది ఏంటంటే నేను దర్శకుడిగాకళాకారుడిగా మంచి కథ దొరికితే ప్రజలకు చేరవేయాలని తపనతోనే మేము సినిమాలు తీస్తాం తప్ప మాకు ఎవరిమీద పగలు, ప్రతీకారాలు ఉండవు.అందర్నీ మిత్రులుగా భావిస్తాం నేను దేవినేని వంగవీటి గార్ల మీద అభిమానంతోనే సినిమా తీశాను. ఈ సినిమా చేసే ముందు కూడా దేవినేని అవినాష్ గారిని కలిసి ఈ సినిమా చేస్తున్నాం అని తెలియజేయడం జరిగింది. దేవినేని అవినాష్ కూడా మేమందరం ఫ్రెండ్స్ గా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పడంతో చాలా సంతోషం వేసింది. ఎవరికీ ఇబ్బందులు రాకుండా దేవినేని సినిమా చేయడం జరిగింది అని అన్నారు.

  చిత్ర నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ.. నాకు ఒకటి ఉండేది ఏదైనా ఒక మంచి సినిమా తీయాలనేది కల ఉండేది ఉండేది. దేవినేని మీద ఏదో ఒక సినిమా తీయాలని తపన ఉండేది ఆ తర్వాత అమరావతిలో నాకు శివ గారు కలవడం జరిగింది. దేవి నాన్నగారు దేవినేనిపైన నా దగ్గర కథ ఉంది అది చేద్దామని నాకు చెప్పడంతో నేను ఏదైతే చేయాలని కలగంటున్నానో అలాంటి కథ నా దగ్గరికి రావడం చాలా సంతోషం అనిపించింది. వాస్తవానికి దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా మంచి స్నేహితులు. కానీ వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయే వచ్చింది. ఇద్దరు స్నేహితులు విడిపోయినప్పుడు వారి మధ్య ఇలాంటి మాటలు వస్తాయి? ఎలాంటి ఘర్షణ జరుగుతుంది? అనేది ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం అని అన్నారు.

   Bezawada Politician Devineni Nehru Biopic Audio released

  నిర్మాత డి.యస్ రావు మాట్లాడుతూ.. బయోపిక్ సినిమాలు తీయడం అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే, ఇలాంటి మూవీలు చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. అలా తీసే దర్శకుల్లో రాంగోపాల్ వర్మ మొదటి వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆయన శిష్యుడు శివనాగేశ్వర రావు (శివ నాగు) రాము బాటలో పయనిస్తూ దేవినేని సినిమాతో ముందుకు వస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. దేవినేని చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

  చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. శివనాగు గారు దర్శకుడు నన్ను కలిసి చలసాని వెంకటరత్నం క్యారెక్టర్లో ప్రేమంటే మొదటిగా నేను జస్ట్ ఊహించలేదు. 1980లో నన్ను హీరోగా చేయమని భారతీ రాజా, ఆ తర్వాత సత్యారెడ్డి సినిమాలు కాంట్రాక్ట్ చేసి ఒక్కొక్క సినిమాకు 5 లక్షలుగా15 లక్షలు ఇస్తానని ఆఫర్ చేసినా నేను వారి ఆఫర్‌ను సున్నితంగా వద్దని చెప్పడం జరిగింది. కానీ చలసాని వెంకటరత్నం పాత్రకు దర్శకుడు ఒప్పించి చేయించాడు ని తెలిపారు.

  దేవినేని చిత్రంలో వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తదితరులు నటించారు.

  English summary
  Vijayawada based politician Devineni Nehru life story getting ready as Devineni Biopic title as Devineni. Bezawada Simham is the tag line. Siva Nagu is the director. Music Director Koti is playing crucial police officer. As part of the promotion, unit released first look of Koti.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X