For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భవదీయుడు భగత్ సింగ్ అప్పటి నుంచే: పవన్ సినిమా పూర్తి వివరాలు లీక్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. అలాగే, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్నాడు. దీంతో ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఇలా చాలా కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు.

  బీచ్‌లో తడిచిన బట్టల్లో అమలా పాల్ రచ్చ: అదొక్కటే అడ్డంగా పెట్టుకుని మరీ ఘాటుగా!

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాణా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాను సాగర్ కే చంద్ర తెరకెక్కించాడు. దీన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన దీనికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకునేందుకు చాలా కష్టాలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

  పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సినిమాల్లో 'భవదీయుడు భగత్ సింగ్' ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమాను మొదలు పెట్టలేదు. అయితే, ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా దాదాపుగా పూర్తి చేసేశారని ఆ మధ్యే అధికారికంగా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించిన కొన్ని విషయాలు బయటకు వచ్చింది.

  బికినీతో కుర్రాడి కోరిక తీర్చిన దిశా పటానీ: హాట్ పిక్ అడగ్గానే ఇలా.. అసలు ట్విస్ట్ తెలిస్తే!

  Bhavadeeyudu Bhagat Singh Starts From June End

  తాజా సమాచారం ప్రకారం 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ జూన్ చివరి వారం నుంచి పట్టాలెక్కబోతుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఇక, ఈ షూటింగ్ ప్రారంభం అయ్యే వరకూ పవన్ 'హరిహర వీరమల్లు' షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నాడట. దీన్ని జూన్ కల్లా పూర్తి చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆ వెంటనే 'భవదీయుడు'గా పవన్ మారబోతున్నాడట. ఇక, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతుంది. ఇందులో పవర్ స్టార్ తెలుగు ప్రొఫెసర్‌గా నటించనున్నాడని అంటున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకగా రూపొందనున్న 'భవదీయుడు భగత్‌సింగ్' మూవీ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా సందేశాత్మకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మిగిలిన నటీనటులు, సాంకేతిక వర్గం గురించిన సమాచారం తెలియాల్సి ఉంది. ఇక, ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్‌లో విడుదల చేసేందుకు కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

  English summary
  Pawan Kalyan Announced Bhavadeeyudu Bhagat Singh Movie with director Harish Shankar. This Movie Will Starts From June End.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X