సినీ పరిశ్రమలో మరో విషాదం: కరోనాతో ‘ఘాజీ’ నటుడు కన్నమూత

కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలకు దెబ్బ మీద దెబ్బ.. దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే పలు సినీ పరిశ్రమలకు చెందిన ఎంతో మంది ఎన్నో కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. అలాంటి సమయంలోనే కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా మృత్యువాత పడ్డారు. దీంతో తరచూ ఏదో ఒక విషాదకర సంఘటన జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలోనే తాజాగా హిందీ చిత్ర పరిశ్రమకు చెందన మరో దిగ్గజ నటుడు కన్నుమూశారు. ఆయనే మాజీ మేజర్ బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్ (52).

దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించిన బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్ శనివారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే శనివారం ఆయన పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు పలు రకాలుగా చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన అక్కడే కన్నుమూశారు. బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్ మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. సినీ ప్రముఖులు ఆయన మరణంపై సంతాపం తెలియజేస్తున్నారు.

Bollywood Actor Bikramjeet Kanwarpal Passed Away

బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్ చాలా కాలం పాటు భారతీయ ఆర్మీలో పని చేశారు. ఈ క్రమంలోనే 2003లో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి 'పేజ్ 3', 'కార్పోరేట్', 'రాకెట్ సింగ్', 'అరక్షణ్', 'మర్డర్ 2', 'జబ్ థక్ హై జాన్', 'ఛాన్స్ పే డ్యాన్స్', '2 స్టేట్స్', 'జంజీర్' వంటి చిత్రాల్లో నటించారు. అలాగే, దగ్గుబాటి రానా నటించిన 'ఘాజీ' చిత్రంలోనూ కీలక పాత్రను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X