ఉదయం ఇచ్చిన మాట.. సాయంత్రానికే నెరవేర్చిన సోనూ సూద్.. ఆ తెలుగు రైతు కోసం..
ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే స్తోమత ఉండి కూడా మౌనంగా అయ్యో పాపం అనే కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. 100రూపాయల్లో రూపాయి దానం చేయడానికి కూడా ఒప్పుకోరు. ఒక్కరి చేస్తే అందరూ అడుగుతారనే బయమో లేక.. మరో ఆలోచన ఉంటుందో తెలియదు గాని వరుస సహాయాలు చేయడానికి కాస్త సందేహిస్తారు. కానీ సోనూ సూద్ మాత్రం ఎంత ఇచ్చిన తప్పులేదు అన్నట్లుగా తనవంతు సహాయంగా పేదల కోసం ఖర్చు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఒక రైతు కోసం ఉదయం ఇచ్చిన మాటను సాయాత్రని కల్లా నెరవేర్చాడు.
Recommended Video

లాక్ డౌన్ లో సహాయాలు..
కరోనా కష్ట కాలంలో చాలా వరకు సెలబ్రెటీస్ ఫండ్స్ ఇచ్చేసి ఒక పనైపోయింది అన్నట్లుగానే ఉన్నారు. కానీ సోనూ సూద్ మాత్రం అలా సైలెంట్ గా ఉండలేదు. డైరెక్ట్ గా రంగంలోకి దిగి వలస కూలీలను ఇంటికి చేర్చాలని ఒక స్పెషల్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు. వేల మందిని పైగా బస్సులతో, చార్టెట్ ఫ్లైట్ లలో వారి గమ్యాలకు చేర్చాడు.

పేద రైతు కష్టాన్ని చూసి..
అయితే రీసెంట్ గా ఒక తెలుగు రైతు కష్టాన్ని చూసి సోనూ సూద్ చలించిపోయారు. కనీసం ఎడ్లను అద్దెకు తెచ్చుకొని వ్యవసాయం చెసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆ రైతు తన ఇద్దరి కుతుళ్ళను జోడెద్దులుగా మార్చి పొలాన్ని దున్నిన వైనం అందరిని షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో వారు పొలం దున్నుతున్న వీడియో వైరల్ కావడంతో సోనూ సూద్ స్పందించాడు.

కుతుళ్ళతోనే నాగలి..
చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండల్లానికి చెందిన పేద రైతు నాగేశ్వరరావు ఇటీవల టమాట పంట వేసి తీవ్రంగా నష్టపోయారు. ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో మరోధారి లేక కుతుళ్ళతోనే నాగలి పట్టించి పొలం దున్నాడు. విషయం తెలుసుకున్న సోనూ సూద్ వారికి ట్రాక్టర్ కొనిస్తాను అని ఆదివారం ఉదయం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

మాట నిలబెట్టుకున్న సోనూ సూద్
ఉదయం అలా మాట ఇచ్చాడో లేదో సాయంత్రాని కల్లా ట్రాక్టర్ ఆ కుటుంబం దగ్గరకు వచ్చేసింది. దీంతో ఆ ఫ్యామిలీ చాలా ఆనందానికి లోనవుతోంది. ఇక సోనూ సూద్ చేసిన మంచి మనికి మరోసారి అభిమానులు సోషల్ మీడియాలో జేజేలు కొడుతున్నారు. రియల్ లైఫ్ లో అతను నిజమైన హీరో అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











