Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పవన్ - రానా సినిమాలో సీనియర్ యాక్టర్ కీలక పాత్ర: వాళ్లిద్దరి తర్వాత ఆయనే హైలైట్
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ఒకటి. ఇందులో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఈగో ఉన్న పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్.. లోకల్ డాన్ మధ్య జరిగే గొడవల నేపథ్యంతో ఈ మూవీ రూపొందుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను విలక్షణ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. కరోనా వల్ల ఇప్పుడ చిత్రీకరణకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.
బడా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చాలా మంది నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ ఈ సినిమాలో దగ్గుబాటి రానా దగ్గర పని చేసే డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడట. అత్యంత ముఖ్యమైన ఈ రోల్ సినిమా మొత్తం ట్రావెల్ చేస్తుందని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు హీరోల తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇదేనని అంటున్నారు. అంతేకాదు, బ్రహ్మాజీ పలికే డైలాగులు కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ పాత్ర ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

భారీ బడ్జెట్.. పేరున్న నటీనటులు నటిస్తోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా.. రానా లోకల్ డాన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి పున: ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఇక, ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. థమస్ సంగీతం సమకూర్చుతున్నాడు.