వెంట్రుక వివాదం... అల్లు అరవింద్‌‌‌ చేతిలో తన్నులు తినలేను ... బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బన్నీ వాస్ టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్‌ వ్యవహారాలు చక్కబెడుతూ.. ఆ తర్వాత జీఏ 2 బ్యానర్‌పై పలు హిట్ చిత్రాలు తీశారు. తాజాగా ఆయన సొంతంగా బీవీ వర్క్క్ బ్యానర్‌ను స్థాపించి మిత్రమండలి అనే సినిమాను నిర్మించారు. ఎప్పుడూ సరదాగా, ప్రశాంతంగా ఉండే బన్నీ వాసు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

నా వెంట్రుక కూడా పీకలేరు
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాసు ఎమోషనల్ అయ్యారు. తన సినిమాను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తొక్కేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకోవద్దని.. నా వెంట్రుక కూడా పీకలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపాయి. డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది నడవదు అనుకుంటే అది చిన్నపిల్లల మెంటాలిటీ అన్నారు. అలాగే నిర్మాత బండ్ల గణేష్.. లిటిల్ హార్ట్స్ సినిమా సమయంలో చేసిన వ్యాఖ్యలకు కూడా ఘాటుగా కౌంటరిచ్చారు బన్నీ వాసు. అల్లు అరవింద్ అనే వ్యక్తి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని.. తాము ఎంత సంపాదించినా ఖచ్చితంగా క్రెడిట్ ఆయనదేనని బన్నీ వాసు తెలిపారు.

Bunny Vasu revealed Allu Aravind scolds him over controversial speech at Mithra Mandali event

టార్గెట్‌గా నెగిటివ్ ట్రోలింగ్
ఆ తర్వాత మిత్రమండలి టీమ్ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో బన్నీ వాసు... నెగిటివ్ రివ్యూలపై విరుచుకుపడ్డారు. సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ చేయించడానికి కొంతమంది పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఒక్కడికే కాదు.. చాలా సినిమాలకు ఇది జరిగిందని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బుక్ మై షో వెబ్‌సైట్‌లో సినిమాలకు రేటింగ్ ఇవ్వడం కూడా సరికాదని ఆయన పేర్కొన్నారు. రివ్యూలు రాయడానికి వేరే వ్యక్తులు వున్నారని.. వారు సినిమాను చూసి విశ్లేషణాత్మకంగా రాస్తారని, జర్నలిస్టులుగా వాళ్ల డ్యూటీ అని చెప్పారు. కానీ మా మీద బతుకుతూ, కమీషన్ తీసుకుంటూ మా సినిమాలకు రేటింగ్ ఇవ్వొదని బుక్ మై షోను బన్నీ వాసు తప్పుబట్టారు.

కాంట్రవర్సీల జోలికి వెళ్లను
అయితే తాను చేసే కామెంట్స్ వల్ల అల్లు అరవింద్ చేతుల్లో తిట్లు తినాల్సి వస్తోందని బన్నీ వాసు పేర్కొన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వాసు మాట్లాడబోతుండగా మరో నిర్మాత ఎస్కేఎన్ మైక్ అందుకుని వాసు గారు ఇప్పుడు అగ్రెసివ్ స్పీచ్ ఇవ్వబోతున్నారని కామెంట్ చేశారు. అలాంటిదేం లేదని, నో కాంట్రవర్సీస్, వెరీ కూల్ అన్నారు బన్నీ వాసు. ఆ కాంట్రవర్సీకి ఆయన తిట్టినన్ని తిట్లు.. నేను మా ఫాదర్‌తో కూడా తినలేదు. అందుకని ఈరోజు నుంచి చాలా జాగ్రత్తగా, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. వైరల్ ఇవ్వమంటారు... మళ్లీ ఆయనే వైర్ పట్టుకుని కొడతారు. ఇంకో నాలుగైదు నెలలు నో వయలెన్స్, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఈ మధ్య అన్నారు బన్నీ వాసు.

మీ గర్ల్ ఫ్రెండ్స్‌తో జాగ్రత్త
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో లాస్ట్ అర్ధగంటలో దీక్షిత్ అద్భుతంగా చేశారు. నా మైండ్‌లో నుంచి ఆ సీన్లు పోవడం లేదు. రష్మిక మందన్న మా గీతా ఆర్ట్స్ గీత.. ఇప్పుడు భూమా. రష్మిక అనడం కంటే కూడా ఇండియన్ క్రష్మిక అనడం కరెక్ట్. థియేటర్‌లో కూర్చునే 50 మంది అమ్మాయిల కథ ఇది.. చాలామంది అమ్మాయిలు, ప్రత్యేకంగా ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్‌తో ఈ సినిమాకు వెళ్తే మాత్రం క్లైమాక్స్‌లో చాలా జాగ్రత్త. మిమ్మల్ని అమ్మాయి హగ్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్... మిమ్మల్ని ఏం అనకుండా సైలెంట్‌గా ఫాలో అవుతుందంటే డబుల్ చెక్ చేసుకోండి. ఏ రియాక్షన్ లేదంటే మాత్రం మీరు ఇంటికి వెళ్లిన తర్వాత మీ రెండు చెప్పలు జాగ్రత్త. భర్తలు, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కేర్ ఫుల్ అని బన్నీ వాసు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X