Just In
- 1 hr ago
మరో సినిమా కోసం అడ్వాన్స్ అందుకున్న వైష్ణవ్ తేజ్..?
- 1 hr ago
ఓడినప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఊపిరాడనివ్వకుండా చేశారు: సింగర్ సునీత
- 2 hrs ago
నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఒక్క ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు: రాజేంద్ర ప్రసాద్
- 3 hrs ago
RRR కంటే భారీ బడ్జెట్: ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు!
Don't Miss!
- Finance
బంగారం ధరలు పెరిగాయి కానీ, రూ.12,000 తక్కువ: 2 నెలల్లో రూ.5,000 డౌన్
- News
ఏపీ న్యాయ రాజధాని అదే- ఆర్ధికమంత్రి బుగ్గన ప్రకటన- జగన్ పేరు కలిసొచ్చేలా
- Sports
రెండుగా విడిపోనున్న టీమిండియా.. ఒకే సమయంలో ఆసియాకప్, ఇంగ్లండ్ టూర్!
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2021 కవాసకి నింజా 300; త్వరలో డెలివరీలు!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నేను అలాంటి రైటర్‌ను కాదు.. ఎన్టీఆర్‌తో సెట్ అయిందా..? అట్లీ కామెంట్స్ వైరల్
తమిళ సంచలనం అట్లీ.. విజయ్‌తో వరుస హిట్లు కొడుతూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. మొదటి ప్రయత్నంగా ఓ చక్కటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించిన అట్లీ... ఆపై మాస్ ఎంటర్టైనర్స్‌పై దృష్టి పెట్టాడు.

విజిల్ కొట్టించేందుకు రెడీ..
ఇళయ దళపతి విజయ్ అంటేనే మాస్.. అలాంటి మాస్ హీరోను ఇంకో రేంజ్‌లో చూపించేశాడు అట్లీ. తేరి, మెర్సెల్ అంటూ రికార్డులు కొల్లగొట్టాడు. విజయ్‌తో హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు మరోసారి విజిల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

ప్రమోషన్స్‌తో బిజీ..
దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది చిత్రబృందం. ఈ క్రమంలో నేడు హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్‌లో అట్లీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

విజిల్ కథ రాయడానికి కారణం అదే..
తాను చాలా సెన్సిటివ్ అని, అమ్మాయిల మీద దారుణాలు జరుగుతున్నాయని, చిన్న పిల్లలను రేప్ చేయడం, ఆడవారిపై యాసిడ్ పోయడం లాంటివి చూసి చలించిపోయి.. విజిల్ కథ రాశానని తెలిపాడు. ఈ సినిమా మహిళా సాధికారతకు సంబంధించిందంటూ పేర్కోన్నాడు.

నేను అలాంటి రైటర్‌ను కాదు..
ఐదారు పాటలు, డ్యాన్సులు, ఫైట్లతో సినిమాను కమర్షియల్‌గా లాగించేయొచ్చు.. ఓ పెద్ద స్టార్ దొరికినప్పుడు కమర్షియల్ సినిమా తీయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకొచ్చాడు. అయితే తాను అలాంటి రైటర్‌ను కాదని, సమాజానికి ఏదైనా ఉపయోగపడేదే రాస్తానని అన్నాడు.

ఎన్టీఆర్ అంటే ఇష్టం..
తన సినిమా నుంచి ఏదైనా చిన్న టీజర్ బయటకు వచ్చినా.. ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపాడు. అయితే త్వరలోనే ఓ తెలుగు సినిమాను చేయనున్నానని ప్రకటించాడు. చివర్లో ప్రసంగాన్ని ముగిస్తూ.. నాకు చాలా ఇష్టమైన వ్యక్తితోనే ఆ సినిమా ఉంటుందని పేర్కొన్నాడు. దీంతో ఆ వ్యక్తి ఎన్టీఆరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటుందనేది తెలిసిందే.