twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ మీద కేంద్రమంత్రి ప్రసంశల వర్షం.. చిరు స్పందన ఎంటో తెలుసా?

    |

    మెగాస్టార్ చిరంజీవి గత కొద్ది రోజులుగా కరోనా వల్ల ఇబ్బందులు పడుతూ ఆక్సిజన్ అందక చనిపోతున్న వారిని కాపాడుకునేందుకు గాను చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లాలోను ఈ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు అయ్యాయి. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆక్సిజన్ అందిస్తూ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు సేవలు కొనసాగుతున్నాయి.

    అయితే ఇప్పటిదాకా చిరంజీవి అందిస్తున్న ఈ సేవలకు సంబంధించి రాజకీయ వర్గాల నుంచి అలాగే మీడియా వర్గాల నుంచి పెద్దగా స్పందన లేకపోయినా తాజాగా సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మానవ జీవితాన్ని కాపాడటమే మానవత్వానికి గొప్ప సేవ అని పేర్కొన్న ఆయన సూపర్ స్టార్ మరియు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి చేస్తున్న నిస్వార్ధమైన సేవ హృదయానికి తాకేలా ఉందని పేర్కొన్నారు. ఈ కరోనా మహమ్మారి సమయంలో చిరంజీవి గారు అలాగే ఆయన బృందం చాలా విలువైన ప్రాణాలను రక్షించడాకి సహాయపడింది అని ఆయన పేర్కొన్నారు.

     Central Minister Kishan reddy thanks chiranjeevi for his service and he responds

    ఇక కిషన్ రెడ్డి ట్వీట్ కి చిరంజీవి కూడా తాను స్పందించారు. మీ దయ గల మాటలకు ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారు అని పేర్కొన్న చిరంజీవి సంక్షోభం ఇంతలా విజృంభిస్తున్న ఈ సమయంలో నేను చేయగలిగిన చిన్న సహాయం చేస్తున్నానని వినమ్రంగా స్పందించారు.

    నిజానికి చిరంజీవి చేస్తున్న సేవలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం వరకు మీడియా కానీ రాజకీయ వర్గాలు గాని ఏమీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ అధినేత చిరంజీవి తో మాట్లాడిన ఒక ఫోన్ కాల్ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఆ తరువాత మీడియాలో కధనాలు రావడం మొదలు కాగా ఇప్పుడు ఎట్టకేలకు చిరంజీవి చేస్తున్న సేవకు రాజకీయ నేతల నుంచి కూడా గుర్తింపు దక్కినట్లు అయింది.

    English summary
    Central Minister Kishan reddy thanks chiranjeevi for his service he stated ''Saving a human life is the noblest service for the humanity. It is heartening to see the commendable and the selfless work done by the superstar and former Minister Shri Chiranjeevi garu & his team during the #Covid19 pandemic which helped in saving many precious lives.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X