భర్త చనిపోయిన 4రోజులకే అలా చేశానట.. మగాడితో కనిపోస్తే చాలు లింక్ పెట్టేస్తున్నారు: సురేఖ వాణి

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న నటి సురేఖ వాణి. అయితే ఆమె ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే జనాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. కొన్నిసార్లు పాజిటివ్ కామెంట్స్ అందుకుంటే మరికొన్ని సార్లు ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న రూమర్స్ గురించి సురేఖ వాణి స్పంధించారు. ఆ విషయాలను తనను ఎంతగానో బాధకు గురి చేశాయని ఆమె తెలిపింది.

Recommended Video

Actress Surekha Vani Panchekattu Video Goes Viral
ఆ ఫొటోలపై నెగిటివ్ కామెంట్స్

ఆ ఫొటోలపై నెగిటివ్ కామెంట్స్


ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా సురేఖవాణి తన కూతురితో కలిసి స్పెషల్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. అందులో గ్లామర్ ఫోటోలతో పాటు ట్రెడిషినల్ ఫొటోలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఆమె గ్లామర్ లుక్స్ పై ఓ వర్గం నెటిజన్స్ నుంచి ఊహించని విధంగా నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. గతంలోనే ఆ ట్రోలింగ్ పై సీరియస్ అయిన సురేఖ కొన్నాళ్లకు లైట్ తీసుకుంది.

భర్త చనిపోయిన నాలుగు రోజులకే..

భర్త చనిపోయిన నాలుగు రోజులకే..

ఇక ఇటీవల ఇంటర్వ్యూలో మళ్ళీ తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందిస్తూ నిజంగా వారు చేసే నెగెటివ్ కామెంట్స్ ఎంత బాధకు గురి చేస్తాయో వారికి అర్థం కావడం లేదని తెలిపింది. నా భర్త చనిపోయిన నాలుగు రోజులకే నేను షూటింగ్స్ కి హ్యాపీగా వెళ్ళాను అని యూ ట్యూబ్ లో కొన్ని అబద్ధపు ప్రచారాలు చేశారని సురేఖ తెలిపింది.

నా జీవితంలో అదే పెద్ద బాధ

నా జీవితంలో అదే పెద్ద బాధ

నా జీవితంలో నా భర్త చనిపోవడమే నాకు అతి పెద్ద దెబ్బ. అదే ఎక్కువ బాధను కలిగించింది. అంతకుముందు ఎలాంటి బాధలు లేవు. ఆ తరువాత కూడా వస్తాయని నేను అనుకోవడం లేదు. అప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేను సినిమాలు చేసుకుంటూ నా కూతురిని పోషించుకోవాల్సిన బాధ్యత నాకు చాలానే ఉంది. ఆ విషయం చాలా మందికి అర్థం కాదు.

 కనిపించిన ప్రతి ఒక్కరితో

కనిపించిన ప్రతి ఒక్కరితో

కనిపించిన ప్రతి ఒక్కరితో అక్రమ సంబంధం అంటూ లింక్ పెట్టేస్తున్నాడు. ఉదాహరణకు మా ఇంట్లోకి మా నాన్న వచ్చినా అన్నయ్య వచ్చినా కూడా అలాంటి కామెంట్స్ చేసేస్తున్నారు. వచ్చిన వ్యక్తి నా కజిన్, బ్రదర్ అని తెలుసుకోకుండా.. సురేఖ మళ్ళీ పెళ్లి చేసుకుందా? అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తున్నారు.

 కొన్నాళ్లకు అభిమానులే సపోర్ట్ చేశారు

కొన్నాళ్లకు అభిమానులే సపోర్ట్ చేశారు

ఆ కామెంట్స్ చూసిన తరువాత బాధ కలిగింది. కానీ కొన్నాళ్లకు నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారని అర్ధమయ్యింది. నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లకు వారే సరైన సమాధానం చెబుతూ ఉంటారు. అప్పుడు నేను సైలెంట్ గా ఉండడం బెటర్ అని అనుకున్నాను. కానీ రూమర్స్ మాత్రం నిజంగా కొంత ఇబ్బంది పెడుతున్నాయని సురేఖ తెలిపింది.

 సినిమాల్లోకి సురేఖ కూతురు

సినిమాల్లోకి సురేఖ కూతురు

సురేఖవాణి కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే త్వరలోనే తన కూతురు కూడా సినిమాల్లోకి రానున్నట్లు ఆమె తెలిపింది. సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని గతంలోనే పలు రూమర్స్ రాగా ఇప్పుడు సురేఖ కూడా అది నిజమే అంటూ త్వరలోనే ఆమెను కథానాయికగా పరిచయం చేయనున్నట్ల క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X