For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్ లో రెచ్చిపోయిన చిన్మయి.. ఆ ఫోటోలు, వీడియోలు పెట్టి, అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటూ!

  |

  సినిమా రంగానికి చేసిన సేవ కంటే ఎక్కువగా వివాదాస్పద అంశాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ వివాహం చేసుకున్న ఆమె గతంలో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో పాటలు పాడటమే కాక కొందరు హీరోయిన్లు డబ్బింగ్ కూడా చెప్పేవారు. అయితే తాజాగా ఆమె లక్నోలో జరిగిన ఒక యువతి ఘటన గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  అనూహ్యంగా రంగంలోకి చిన్మయి

  అనూహ్యంగా రంగంలోకి చిన్మయి


  రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఓ యువతి నడిరోడ్డు మీద తనను డ్యాష్ ఇవ్వ పోయాడని ఆరోపిస్తూ ఒక క్యాబ్ డ్రైవర్ ని దారుణంగా చెంపల మీద వాయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. నిజానికి ముందుగా ఆ యువతి చేసింది కరెక్టే అని అందరూ భావించారు కానీ తర్వాత అసలు విషయం తెలిసి క్యాబ్ డ్రైవర్ తప్పేమీ లేదని తెలుసుకున్న ఆమె మీద విమర్శల వర్షం కురుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో లో సింగర్ చిన్మయి ప్రస్తావన ఏమీ లేకపోయినప్పటికీ ఆమె ఎక్కువగా ఆడ వాళ్లకు అండగా నిలబడి ఫెమినిజం పేరుతో రకరకాల పోస్టులు పెడుతూ ఉంటుంది.

  వాళ్ళ వల్లే ఇలా

  వాళ్ళ వల్లే ఇలా

  దీంతో తెలుగులో ఉన్న కొన్ని మీమ్ పేజెస్ అన్ని విషయాల్లో ఆడ వాళ్లను వెనకేసుకు వచ్చె చిన్మయి ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ఆమెను తమ పోస్టులలో టాగ్ చేయడం మొదలుపెట్టారు. ఆమెను టాగ్ చేయడంతో కొందరు అయితే ఏకంగా ఆమె ఇన్ బాక్స్ లోకి వెళ్లి మరి ఈ విషయం మీద ఎందుకు స్పందించడం లేదు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎట్టకేలకు ఆమె ఈ విషయం మీద కొన్ని పోస్టులు షేర్ చేశారు. అయితే ఆమె పెట్టిన విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది ట్రోల్ చేస్తున్నారని ఆమె తన తాజా లైవ్ సెషన్ లో చెప్పుకొచ్చారు. నిజానికి చాలా మంది ఈ విషయం మీద స్పందించమని కోరడంతో ఆమె స్పందిస్తూ బెంగళూరు ఘటనలో జొమాటో ఉద్యోగి ఉద్యోగం పోలేదని, అలాగే లక్నో ఘటనలో క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం కూడా పోలేదని ఆమె కామెంట్ చేశారు.

  అమ్మాయిలు బ్లేమ్ అవుతారుగా

  అమ్మాయిలు బ్లేమ్ అవుతారుగా

  అయితే ఈ రెండు ఘటనలలో తప్పు అబ్బాయిలది కాకపోతే అమ్మాయిలు ఎలాగూ బ్లేం అవుతారు కాబట్టి ఈ విషయం మీద పెద్దగా మాట్లాడాల్సిన ఏమీ లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె రాసుకొచ్చింది ఒకటయితే మీమ్ పేజెస్ వాళ్లకి అర్థమైంది మరొకటి కావడంతో ఆమెను మళ్లీ టార్గెట్ చేయడంతో ఎట్టకేలకు ఆన్లైన్ లోకి వచ్చి మరి సమాధానం ఇచ్చారు.. ఈ వ్యవహారంలో ఆ అమ్మాయి అలా ప్రవర్తించకూడదు అని పేర్కొన్న ఆమె ఇలా ఎవరు చేసినా అది ఆడ, మగ అనే సంబంధం లేకుండా తప్పేనని అన్నారు.. ఇక ఈ అంశం గురించి మాట్లాడుతూ ఆమె తనకు రోజూ వందలాది అసభ్యకరమైన సందేశాలు వస్తూ ఉంటాయి అని నాకే ఇన్ని వస్తున్నాయి అంటే ఇక హీరోయిన్స్ పరిస్థితి ఊహించుకోవడం కూడా కష్టమేనని చెప్పుకొచ్చారు.

  పురుషాంగాలతో హస్తప్రయోగం

  పురుషాంగాలతో హస్తప్రయోగం

  అంతేగాక ఆమె మాట్లాడుతూ తనకు రోజూ వందలాది మెసేజీలలో చాలా మంది యువకులు తమ పురుషాంగాల ఫోటోలను, హస్తప్రయోగం చేసుకుంటున్న కొన్ని వీడియోలను కూడా పెడతారని ఇది చూడడానికి తనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. చాలా మంది మగవాళ్ళు తమ పురుషాంగం అందంగా ఉంటుందని వాటిని స్త్రీలు చూసి ఆనంద పడతారు అని భావిస్తారని కానీ అంతకన్నా చండాలం మరొకటి ఉండదు అని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాక మాట్లాడితే లం*, దెం* అంటూ బూతులు మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. మన సమాజంలో ఎవరైతే మా మీద లైంగిక దాడి జరిగిందని బయటకు వస్తారో వాళ్లే బాధితులుగా మిగిలిపోతున్నారు అని, చెబుతూ తన ఉదంతాన్ని ప్రస్తావించింది. తాను తమిళ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడు అని అంటే ఆయన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి తన మీద చర్యలు తీసుకుని తనను తమిళ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారని పేర్కొంది.

  Recommended Video

  Samantha Fans Demand Apologize From Pooja Hegde
  అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోండి

  అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోండి

  ఇలాంటి చర్యల వలన నిజంగా ఏమైనా లైంగిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎవరూ బయటకు రాలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆమె చెప్పుకొచ్చింది.. ఇక ఆడవాళ్ళ గురించి మాట్లాడినంత మాత్రాన అందరూ మగవాళ్ళని ద్వేషిస్తారు అని కాదని అందరు మగవాళ్లు ఒకలా ఉండరని మగవాళ్ళలో ఇలాంటి పనులు చేసే వారిని మాత్రమే టార్గెట్ చేస్తామని అని చెప్పుకొచ్చారు.. మగవాళ్ళ లో చాలా మంచివారు కూడా ఉంటారని పెళ్ళికి కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి ఖర్చులో సగం వాళ్ళ భరించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారని అలాంటి వాళ్ళను అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.. ఇక తనకు చాలా వేరే పనులు ఉంటాయని 24 గంటలు సోషల్ మీడియా మీద కూర్చుని ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.. మొత్తం మీద లక్నో యువతి వ్యవహారం ఇప్పుడు సింగర్ చిన్మయి టార్గెట్ అయ్యేలా చేసింది అని మాత్రం చెప్పక తప్పదు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Singer cum dubbing artist Chinmayi is in the news for more controversial issues than her service to the film industry. She is married to director Rahul Ravindran. recently she made sensational remarks about a young woman incident in Lucknow. here are the details of it
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X