చిరంజీవి కేసు నమోదు.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు

సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని సినీ ప్రముఖులపై దుష్ప్రచారం చేస్తున్న నెటిజన్లు, గ్రూపులపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్దమయ్యారు. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సినీ ప్రముఖుల ఫోటోలు మార్ఫింగ్ చేసి వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న ఆసాంఘీక శక్తులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఏఐ సహకారంతో పోస్టులు పెడుతున్న వారిపై మెగాస్టార్ చిరంజీవి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దూకారు. ఆ కేసు వివరాల్లోకి వెళితే..

వెబ్ ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) వల్ల మంచితోపాటు చెడు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నది. అయితే సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి అశ్లీలత, అసభ్యతను జొప్పిస్తున్నారనే విమర్శలు అధికంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి చిరంజీవి టీమ్ కదిలింది. తన పేరును, ఫోటోలను వాడుకొంటూ అశ్లీలకరంగా పోస్టులు పెడుతున్న విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.

Chirajeevi files complaint on Deep Fake Video

సైబర్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి టీమ్ సభ్యులు.. తమ హీరో ఫోటోలను మార్ఫింగ్ చేసి పాపులారిటీని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నటించిన చిత్రాల్లోని ఫోటోలు, వీడియోలను ఏఐ సహకారంతో సృష్టిస్తున్నారు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా బిహేవ్ చేస్తున్నారు. వ్యక్తిగత ద్వేషం, ప్రొషెషనల్ జెలసీతో ఈ చర్యకు పూనుకొంటున్నారనే విషయాలను సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.

భారతీయ సినిమా పరిశ్రమలో అత్యున్నత స్థానానికి ఎదిగిన చిరంజీవికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వీడియోలన్నీ ఫేక్. తప్పుడు రీతిలో పోస్టు చేస్తున్న వాటిలో వాస్తవం లేదు. డీప్ ఫేక్ పోర్నోగ్రఫి ఫోటోలు సృష్టిస్తున్నారు. నా ఫోటోలు, సినిమాలోని సన్నివేశాలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి చర్యలన్నీ చట్టరీత్యా నేరం. కాబట్టి ఈ విషయాలపై తగు చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

నా ఫోటోలను, వీడియోలను, సినిమా సన్నివేశాలను ఉపయోగించి వాటిని ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్నారు. అలాంటి మార్పింగ్ కంటెంట్ నా ప్రతిష్టకు తీవ్రమైన నష్టాన్ని క్రియేట్ చేస్తున్నది. ఎన్నో ఏళ్లుగా శ్రమించి సంపాదించుకొన్న గౌరవానికి భంగం కలిగించేలా చేస్తున్నది అని చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: chirajeevi telangana cyber crime
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X